Categories
Govt Failures News

ఓయూలో మందకృష్ణ మాదిగ నిర్భంధ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు

సామాజిక ఉద్యమాల‌ పితామహుడు, MRPS జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్భందించడం‌ కేసీఆర్ నిరంకుశ విధానాలకు నిదర్శనమని ఓయూలోని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ రోజు ఓయూలోని న్యూ సెమినార్ హాల్లో 30 విద్యార్థి సంఘాలు సమావేశమయ్యాయి. మందకృష్ణ మాదిగ గారి తక్షణ విడుదల కోసం ఈ సంఘాలన్నీ *మందకృష్ణ మాదిగ నిర్భంధ వ్యతిరేక కమిటీ*గా ఏర్పడ్డాయి. తర్వాత మీడియా సమావేశంలో కార్యచరణను ప్రకటించారు.

*కమిటీ సభ్యులు*

✍ కో ఆర్డినేటర్లు – కోట రాజేష్, డేవిడ్, పల్లెర్ల సుధాకర్.

✍ కన్వీనర్లు – ఆశప్ప (OUJAC), సలీంపాష (TVUV), సాంబమూర్తి (SFI), గ్యార నరేష్ (AISF), దర్శన్ (DBSA).

*కార్యాచరణ*

👉 జనవరి 22 న.

సోమాజికగూడ ప్రెస్ క్లబ్ లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలతో *రౌండ్ టేబుల్ సమావేశం*.

👉 జనవరి 23 న.

ఓయూలోని అన్నీ హాస్టల్లో *కరప్రతాలతో ప్రచారం*.

👉 జనవరి 24 న.

ఆర్ట్స్ కాలేజీ ముందు ఒక *నిరాహార రోజు దీక్ష*.

👉 జనవరి 26 న.

రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల ముందు *సంకేళ్లతో నిరసన ప్రదర్శన*.

👉 జనవరి 27 నుండి ఫిబ్రవరి 3 వరకు అన్నీ యూనివర్శిటీల్లో, జిల్లాలో నిర్భందాలకు వ్యతిరేకంగా *సదస్సులు*.

👉 ఫిబ్రవరి 4 న.

*ఛలో‌ ఉస్మానియా* పేరుతో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు భారీ బహిరంగ సభ.

—- *మందకృష్ణ మాదిగ నిర్భంధ వ్యతిరేక కమిటీ*

Categories
Govt Failures

కేసీఆర్ ప్రభుత్వానికి ఆలోజింపచేసే ఓపెన్ లెటర్ రాసిన రైతు బిడ్డ 

To,

The CM 

CC: All Ministers,

Sub: Save Agriculture

Respected Sir

రైతులకు ఎరువులు ఉచితం

వ్యవసాయానికి కరెంటు ఉచితం

రుణ మాఫీ

విత్తనాలు సబ్సిడీ

ఈ ప్రభుత్వంలో రైతులకు అన్నీ ఫ్రీ 

వీరికి ఇంకేం కావాలి , అని ప్రజల ఆలోచన

70%  వ్యవసాయం పై ఆధార పడ్డవారే , కాని వీరికి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి, 

అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని ప్రభుత్వ ఆలోచన

కానీ నేను ఒక రైతు బిడ్డగా చెబుతున్నా , 

మా రైతులకు ఏది ఫ్రీ ఫ్రీ ఫ్రీ గా ఇవ్వాల్సిన అవసరం లేదు అని విన్నవిస్తున్నా,

ఎందుకంటే ,

అంగన్ వాడి కార్యకర్తలను టీచర్లుగా ఎలా గుర్తించి 4,000 జీతం నుండి 10,000 జీతంగా పెంచావో,

1,500 జీతం ఉన్న సర్పంచ్ జీతం 5,000 చేసావో ,

75,000 జీతం ఉన్న MLA జీతం 1,50,000 చేసావో ,

విపరీతంగా పెంచిన గవర్నమెంటు ఉద్యోగుల జీతాలను ఏ విధంగా పెంచావో , 

అదే విధంగా , అదే శాతంతో సమానంగా రైతు పండించిన పంటకు ధరను నిర్ణయించి , ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలి.

ఎందుకు కొనుగోలు చెయ్యరు ప్రశ్నిద్దాం, పోరాడుదాం

లక్ష రూపాయల జీతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రోగం వస్తే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఫ్రీ , అతని పిల్లలకి ఫ్రీ , అతని భార్యకు ఫ్రీ మరియు అతని తల్లిదండ్రులకు కూడా ఫ్రీ

వారికి ఆఫీస్ టైం 9AM to 4:30PM , కచ్చితంగా టైం to టైం వెళతాడు , వస్తాడు.

మరి రైతు లేనిదే రాజ్యం లేదు , రైతే రాజు , రైతు లేకుండా జీవించలేము ,జై జవాన్ జై కిసాన్ , రైతు ఏడ్చిన రాజ్యం లేదు , ఎద్దు ఏడ్చిన ఎవుసం లేదు అని చెపుతున్న రాజకీయ నాయకుల్లారా ,

రాత్రనక , పగలనక , ఏ టైం లేకుండా , ఎప్పుడు పడితే అప్పుడు పొలానికి వెళ్లిన రైతు , తిరిగి వస్తాడో , లేదో తెలియక , ఇంటి దగ్గర ఎదురు చూసే భార్య , పిల్లలు , పంటకు రోగం , మనిషికి రోగం వస్తే ఎక్కడ చూపియ్య లో తెలియక , అప్పు చేసి , దిగుబడి తగ్గి కుంగిపోయే రైతులకు ఇస్తే ఫ్రీ అంటారు, ఉద్యోగులకు ఇస్తే ఇంక్రిమెంట్ అంటారు…

Please please feel it & Share it.. 🙏🙏                   ఇట్లు

మీ ఒక రైతు బిడ్డ

Categories
Govt Failures SCAMS

విద్యుత్‌ కొనకుండానే ఉత్త పుణ్యానికి రూ.957 కోట్లు చెల్లించిన రాష్ట్ర డిస్కంలు

ఉత్త పుణ్యానికి రూ.957 కోట్లు.. విద్యుత్‌ కొనకుండానే ఉత్పత్తి సంస్థలకు చెల్లించిన రాష్ట్ర డిస్కంలు.. డిమాండ్‌కు సరిపడా కరెంట్‌ కొనుగోలుకు ముందస్తు ఒప్పందాలు.. అంచనాలు తప్పి 4,910 ఎంయూల విద్యుత్‌ బ్యాక్‌ డౌన్‌.. కొనకపోయినా యూనిట్‌కు రూ.1.95 చొప్పున చెల్లించిన వైనం

కొనుగోలు చేయని విద్యుత్‌కు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు అక్షరాల రూ.957.45 కోట్ల చార్జీలు చెల్లిం చాయి. రాష్ట్ర అవసరాలకు కావాల్సిన విద్యుత్‌ సమీకరణకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న డిస్కంలు.. అంచనాలు తలకిందులవడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాయి. అంచనాలకు తగ్గట్లు డిమాండ్‌ లేక 2016–17లో 4,910 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను బ్యాకింగ్‌ డౌన్‌ చేయించాయి. ఒక్కో యూనిట్‌కు రూ.1.95 చొప్పున ఆ 4,910 ఎంయూలకు రూ.957.45 కోట్ల స్థిర చార్జీలు విద్యుదుత్పత్తి కంపెనీలకు చెల్లించాయి.

కొనకపోయినా ఎందుకంటే..

రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను అంచనా వేసి ఆ మేరకు విద్యుత్‌ సమీకరించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలతో డిస్కం లు ముందస్తుగా కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)లు చేసుకున్నాయి. దీంతో విద్యుత్‌ కొనుగోలు చేయకపోయినా ఉత్పత్తి కంపెనీలకు విద్యుత్‌ స్థిర చార్జీలు లేక జరిమానా డిస్కంలు చెల్లించాలి.

ప్లాంట్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన విద్యుదుత్పత్తి కంపెనీలు.. నిరంతరంగా ఉత్పత్తి చేసి అమ్మకాలు సాగిస్తేనే మనుగడలో ఉంటాయి. డిమాండ్‌ లేనపుడు ఉత్పత్తి తగ్గించాల్సి వస్తే కంపెనీలు నష్టపోకుండా తగ్గించిన విద్యుత్‌కు స్థిర చార్జీలు లేదా జరిమానా చెల్లించాలని ఒప్పందాల్లో పొందుç ³రుస్తారు. ఇలా డిమాండ్‌ లేనప్పుడు ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించుకోవడం లేదా నిలుపుదల చేయడాన్ని బ్యాకింగ్‌ డౌన్‌ అంటారు.  

కొంప ముంచిన ఓపెన్‌ యాక్సెస్‌..

రాష్ట్రంలోని భారీ పరిశ్రమలు, రైల్వేలు, వాణిజ్య సంస్థలు, ఇతర వినియోగదారులు 2016–17లో ఓపెన్‌ యాక్సెస్‌ ద్వారా బహిరంగ మార్కెట్‌ నుంచి 2,134 ఎంయూల విద్యుత్‌ కొనడం డిస్కంల కొంపముంచింది. విద్యుత్‌ చట్టం–2003లోని వెసులుబాటును ఉపయోగించుకుని డిస్కంలను కాదని బహిరంగ మార్కెట్‌ నుంచి తక్కువ ధరకు వినియోగదారులు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారు.

బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధరలు పతనమవడంతో 2015–16లో 902 ఎంయూలు ఉన్న ఓపెన్‌ యాక్సెస్‌ కొనుగోళ్లు 2016–17 వచ్చేసరికి 2,134 ఎంయూలకు పెరిగాయి. ఓవైపు నిరంతర విద్యుత్‌ సరఫరాకు డిస్కంలు పెద్ద మొత్తంలో విద్యుత్‌ సమీకరించగా.. కొందరు వినియోగదారులు ఓపెన్‌ యాక్సెస్‌కు వెళ్లడం, అంచనాలకు తగ్గట్లు డిమాండ్‌ లేకపోవడంతో 4,910 ఎంయూల విద్యుత్‌ బ్యాకింగ్‌ డౌన్‌ చేసుకొని నష్టపోవాల్సి వచ్చింది.  

నిరంతర విద్యుత్‌ సరఫరా కోసమే: డిస్కంలు  

నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం ముందస్తు ప్రణాళికలతో విద్యుత్‌ సమీకరించామని ఈఆర్సీకి డిస్కంలు వివరణ ఇచ్చాయి. 2015–16లో రాష్ట్ర గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 6,849 ఎంయూలు కాగా, 2016–17లో 9,191 ఎంయూలకు పెరిగిందన్నాయి. ముందస్తు ప్రణాళికల వల్లే డిమాండ్‌ పెరిగినా సరఫరా కొనసాగించామని సమర్థించుకున్నాయి. 

Categories
SPR Analysis

నెహ్రూ అంబేద్కర్ ఎప్పటికీ ఆత్మీయులే

1945 సెప్టంబర్ 2వ తారీఖున బ్రిటిష్ వారు రెండవ ప్రపంచ యుద్ధం గెలవంగనే ..19 న వైస్రాయ్ ..”సెంట్రల్ లెగిస్లటివ్ అసెంబ్లీ” కి (నేటి లోక్ సభ) మరియు ప్రావిన్షల్ అసెంబ్లీ (నేటి రాష్ట్రాల అసెంబ్లీల లాగ ) కి ఎలెక్షన్లు డిసెంబర్,జానవరీలో ఉంటయని ప్రకటించిన్రు.సెంట్రల్ అసెంబ్లీ లో 102 సీట్లకు గాను 59 కాంగ్రెస్,30 ముస్లిం లీగ్ గెలిచింది.ప్రావిన్షల్ అసెంబ్లీ లో 1585 సీట్లకు 923 కాంగ్రెస్,425 ముస్లిం లీగ్ గెలిచినై.ఈ ప్రావిన్షల్ అసెంబ్లీ లో గెలిచిన సబ్యులు ఆ ఆ రాష్ట్రాల జనాభా ప్రకారం,కాన్స్ట్యూంట్ అసెంబ్లీ కి (రాజ్యంగం రాయటానికి మరియు కొత్తగ ఎన్నికలు జరిగే వరకు (1952)) 296 మంది సభ్యులను ఎన్నుకున్నరు…208 కాంగ్రెస్ గెలవగ ,73 ముస్లిం లీగ్ గెలిచింది. 1947 లో స్వాతంత్రం రాంగనే సెంట్రల్ అసెంబ్లీని రద్దు చేసి , దాని స్థానంలో కాన్స్ట్యూంట్ అసెంబ్లీ ని కొనసాగించిన్రు. అంబేద్కర్ 1946 లో బాంబే ప్రావ్నిస్ నుండి ఓడిపోతే, జోగేంద్ర నాథ్ మండల్ (బెంగాల్ లో ముస్లిం లీగ్ కి చెందిన దళిత నాయకులు) అంబేద్కర్ ని బెంగాల్ నుండి కాన్స్ట్యూంట్ అసెంబ్లీ కి ఎన్నిక చేపించిన్రు (స్కెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ తరుఫున .. ఇండిపెండెంట్లు, ముస్లిం లీగ్ సబ్యుల మద్దతు తో ).అయితే కాన్స్ట్యూంట్ అసెంబ్లీ ని ముస్లిం లీగ్ బాయ్కాట్ చేసింది తరువాత కాలంలో ..భారత్ విడిపోయింది..అంబేద్కర్ ఎన్నుకోబడిన ప్రాంతం పాకిస్థాన్ కి పోయింది. అంబేద్కర్ ని ఎలాగైన కాన్స్ట్యూంట్ అసెంబ్లీకి తేవాలని , ఎం అర్ జయకర్ అనే కాంగ్రెస్ పార్టీ సభ్యులని (వీరు ఫెడెరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్ గ పనిచేసిన్రు ) రాజీనామా చేపించి కాన్స్ట్యూంట్ అసెంబ్లీ కి నెహ్రు,రాజేంద్ర ప్రసాద్, పటేల్ గారు ఎన్నిక చేపించిన్రు..1947 జులై లొ.ఆగస్ట్ లో స్వాతంత్రం రాంగనే , మొదటి న్యాయ శాఖ మంత్రి గ ,డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గ చేసిన్రు.డ్రాఫ్టింగ్ కమిటీ లో 7 గురు సభ్యులున్నపటికి ..ఒకరు చనిపొటం,ఒకరు రాజినామ చెయ్యటం ,ఒకరు అమెరికా పోవటం..ఓ ఇద్దరికి ఆరోగ్య సమస్యల వల్ల..మొత్తం పని అంబేద్కరే ..తన ఆరోగ్యం సహకరించకున్నా చేసిన్రు. నెహ్రూ..అంబేద్కర్ కలిసి హిందూ చట్టంలో విప్లవాత్మక మార్పులకు ప్రయత్నించిన్రు..

1.విదవలకు,బిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు 

2.స్త్రీ కు విడాకులిచ్చే స్వేచ్చ 

3.భహు భార్యత్వం ను నిషేదించటం 

4.ఇంటర్ కాస్ట్ మారేజెస్ 

5.వేరే కులాల పిల్లలని దత్తత తీసుకునే స్వేచ్చ ..అయితే అర్ ఎస్ ఎస్ వారు వీటిని వ్యతిరెకించిన్రు..నెహ్రూ అంబేద్కర్ దిష్టి బొమ్మలు తగలబెట్టిన్రు … పార్లమెంట్ లో రైట్ వింగ్ వారు బిల్ మీద చర్చను అడ్డుకున్నరు..విసుగు చెందిన అంబేద్కర్ 1951 సెప్టంబర్లో రాజినామ చేసిన్రు.

1952లో 1954(బై ఎలెక్షన్) లో అంబేద్కర్ స్కెడ్యూలడ్ కాస్ట్ ఫెడరేషన్ తరుఫున పోటి చేసి ఓడిపోగా .. 1954 లో మళ్ళి రాజ్యసభకు ఎన్నిక కావటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది.1955 లో హిందూ కోడ్ బిల్ల్ ను పార్లమెంట్ ఆమోదించింది. 1956 డిసెంబర్ 6 న అంబేద్కర్ కన్నుమూసారు. 

అంబేద్కర్ ని బెంగాల్ నుంచి ఎన్నిక చేపించిన జోగేంద్ర నాథ్ మండల్ పాకిస్థాన్ కి వెళ్ళిపోయి ఆ దేశ మొట్ట మొదటి న్యాయ మరియు కార్మిక శాఖ మంత్రిగ పనిచేసిన్రు.అక్కడి వివక్షను తట్టుకోలేక 1950 అక్టోబర్ 8 న రాజినామ చేసి … నా దేశం భారత్ అని మన దేశానికి వచ్చిన్రు. నెహ్రూ.. అంబేద్కర్ ఎప్పటికీ ఆత్మీయులే.–స్రవంత్ పోరెడ్డి

Categories
News Political Curruption

అసలేం జరుగుతుంది తెలంగాణ లో…..? // సీనియర్ రాజకీయ నాయకుని విశ్లేషణ

తెలంగాణ లో అసలు ప్రతిపక్ష పాత్ర ఎవరిది ?
ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన వాళ్ళు ఎవరు ?

కెసిఆర్ కు ప్రధాన శత్రువు ఎవరు ?
కెసిఆర్ కాంగ్రెస్ పార్టీ కి, బీజేపీ , తెలుగుదేశం పార్టీలకు భయపడటం లేదా ?
కెసిఆర్ పత్రికలను జనం నమ్మడం లేదా ?
అందుకే ఆంధ్రజ్యోతి , ఈనాడు ను నమ్ముకున్నాడా ?
సోషల్ మీడియానే ప్రధాన పాత్ర పోషించబోతుందా…. ?

ఆగ మేఘాల మీద కాళేశ్వరం పంప్ హౌస్ పనులు ఎందుకు జరుగుతున్నాయి ?
కెసిఆర్ ఫ్యామిలీ చెప్పేటి లెక్కలన్నీ ధోఖా భాజ్ లెక్కలేనా ?
మూడేండ్లలో కెసిఆర్ ఫ్యామిలీ సంపాదించినా ఆస్తులెన్ని ?
భగీరథ మీద చేసిన అప్పులో కొంత డబల్ బెడ్ రూమ్ ల కోసం , మూడెకరాల భూమి కోసం ఎందుకు చేయడం లేదు …

ఉద్యోగాల భర్తీ లో కావాలనే తాత్సారం చేస్తున్నారా ?
మూడున్నర యేండ్లు గడిచిన తొందరేముంది అని ktr ఎందుకంటుండు ?

10 టీవీ ని కూడా దారిలోకి తెచ్చుకోబోతున్నారా ?
సిపిఎం, సిపిఐ పార్టీలకు తెరాస తో ఉన్న పంచాయతీ ఏంది ?

I & PR ను నడిపిస్తున్నదెవరు ? పత్రికలను ఎలా మేనేజ్ చేస్తున్నారు ?
పత్రికా ప్రకటనల్లో కమిషన్ తీసుకుంటున్నదెవరు ?
టీన్యూస్ నుండి స్పెషల్ స్టోరీలు ఏ పత్రికలకు, ఏ చానెల్స్ కి వెళ్తున్నాయి ?

ఒక సీనియర్ రాజకీయ వేత్త విశ్లేషణ కు చెందిన Spirit of Telangana
ఎక్సక్లూసివ్ ఆడియో టేప్

Categories
KCR Flip-Flops News

కేసీఆర్ కాళ్ల బేరం కోసం వీస్తున్న పవనాలు జ్ఞానం లేని “అజ్ఞాతవాసి” కోసమేనా ?

విషయ పరిజ్ఞానం లేని పవన్ కల్యాణ్ లాగానే అభిమానులం అని చెప్పుక తిరిగే వాళ్ళు అయినా విషయం పైన పరిజ్ఞానం, జ్ఞాన సముపార్జన పెంచుకోండి, పవన్ కల్యాణ్ గారికి చెప్పండి.
వ్యక్తిగతంగా పవన్ సినిమాలు అంటే మాకు ఇష్టమే కేసీఆర్ లా వాడెవడో నాకు తెల్వదు, ఒక్క చిటికేస్తే గింతంత పవన్ కళ్యాణ్ 1000 ముక్కలు ఆయుతాడు అని మేము అనడం లేదు.
ఇక్కడ ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి పేపర్ లలో ఆడ్స్ వేసింది చూసి ఎలా ఇస్తున్నారో తెలుసుకుందాం అని ప్రగతి భవన్ కి వచ్చి, ఇది TRS గనతే అని పవన్ KCR కి వత్తాసు పలకడం చూస్తుంటే పూర్తిగా విషయ పరిజ్ఞానం లేని అజ్ఞాని లా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు.

KCR Pawan

పేపర్ లలో ఉద్యోగాలు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర లేక రైతుల ఆత్మహత్యలు, దళితులపై దాడులు పవన్ కి కనిపించడం లేదా…… ?
వీటిపైన కేసీఆర్ ని ఎందుకు నిలదీయ లేదు….?
పోనీ కనీసం బాధితులను అయినా కలిశాడా….?

ఇక తెలంగాణాలో పవర్  విషయానికి వస్తే గత 3 సంవత్సరాలుగా ఎన్ని పవర్ ప్లాంట్స్ TRS హయాంలో నిర్మించారు, కేసీఆర్ ఎప్పుడు చెప్పే భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్స్ నిర్మాణం పూర్తి అయిందా….?
ఇప్పుడు ఒక్క తెలంగాణ నే కాదు దేశం మొత్తం 24 గంటల విద్యుత్తు దిశగా అడుగులు వేస్తుంది, చాలా రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్తు ఇస్తున్నారు. ఇదంతా గత ప్రభుత్వాల కృషి, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పట్టుదల. తెలంగాణ ప్రభుత్వం కొన్ని పవర్ కంపెనీల నుండి కమిషన్ లకు కక్కుర్తిపడి అధిక ధరలకు కొంటుంది అని ప్రతిపక్షాల ఆరోపణలు కూడా ఉన్నాయి.
తెలంగాణ జేఏసీ పవర్ గూర్చి ఏం చెబుతుందో చూద్దాం. ఈ క్రింది ఆర్టికల్స్ చదువండి.

వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్తు ప్రచారాలు – వాస్తవాలు

నిరంతర విద్యుత్తు-ప్రచారాలు – వాస్తవాలు

ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ మీటింగ్ ఏదో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో జరిగిందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది కత్తి మహేష్ చెప్పినట్టు అజ్ఞాత వాసి సినిమా టిక్కెట్లు అమ్ముకొనికేనా…..?

కెసిఆర్ తాట తీస్తా అన్నోడు అజ్ఞాతవాసి సినిమా కోసం మరీ ఇంత కాళ్ళ బేరానికి పోతాడా పవన్…?
తెలంగాణ సబ్బండ వర్ణాల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా లో కల్వకుంట్ల అయ్యా కొడుకులు చేస్తున్న కుట్రలను బట్టలిప్పి చూపించాడు. ఆ సినిమా లో చూపించి నట్టే ఇప్పుడు ఉద్యమాన్ని అయ్యకొడుకులు తమ స్వార్థం కోసం వాడుకుతున్నారు.
మరి ఇప్పుడు పవన్ దేని కోసం కేసీఆర్ అసత్యాలకు వత్తాసు పలుకుతుండు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్టు కేసీఆర్ ఉచ్చులో పడి పవన్ రాజకీయంగా బలియైనడా…..?

తెలంగాణ వస్తే 11 రోజులు ఉపవాసం ఉన్న పవన్ కళ్యాణ్ ను ఓటు బ్యాంకు(సెటిలర్స్) రాజకీయల కోసం కెసిఆర్ వాడుకుంటుండా ?

కేసీఆర్ చేసిన సర్వే ప్రకారం కొన్ని నియోజకవర్గాలలో 10 వేల లోపు ఓట్లతో TRS ఓడిపోయే దగ్గర పవన్ కళ్యాణ్ మద్దతు ఉంటే గెలిచే అవకాశం ఉంటదని పవన్ మద్దతు కోరుతున్నాడని మరికొంత మంది వాదన. 

ఇంకా కొంతమంది పార్టీ ఆఫీస్ కోసం స్థలం కేటాయించుకోవడం కోసం కూడా అయిఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Categories
Govt Failures News

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు వాయిదా కి కారణాలేంటి…..? ప్రభుత్వ చేతగాని తనమా…?

విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వాలు… సైన్స్ కాంగ్రెస్ ను రద్దు చేసుకున్నాయి.

1. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీ            ఏమయ్యింది.

2. కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న 3 కోట్ల ఉద్యోగాల హామీ గుర్తుందా..

3. సైన్సు ను పాటించకుండా, మూఢనమ్మకాలతో పాలించే పాలకులకు… అసలు సమావేశాలను ప్రారంభించే నైతిక అర్హత లేదు.

4. విద్యార్థుల భాగస్వామ్యం లేకుండా… సైన్స్ కాంగ్రెస్ ను ఎలా నిర్వహించాలనుకున్నారు.

5. పరిశోధనలకు ల్యాబ్ లు కెటాయించని యూనివర్సిటీ అధికారులు… సైన్స్ ను ఎలా ప్రోత్సాహిస్తారు.

6. పరిశోధనా విద్యార్థులకు ఫెలోషిప్ లు ఇవ్వకుండా… ఉన్నవాటిని తీసివేస్తే… పరిశోధనలు ఎలా సాగుతాయి.

పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ మరోసారి పాలకులకు గట్టి షాక్ ఇచ్చింది. నాడు తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర పాలకులకు ముచ్చెమటలు పట్టించిన ఉస్మానియా యూనివర్శిటీ నేడు తెలంగాణ పాలకులకు సైతం అందే రీతిలో చుక్కలు చూపిస్తున్నది. తాజాగా ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ సర్కారుకు భారీ షాక్ ఇచ్చారు. ఆ వివరాలు కింద చదవండి.

తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటి వరకు కోర్టుల నుంచి సర్కారుకు షాక్ తగిలే పరిస్థితులు ఉండేవి. కానీ ఈసారి కోర్టు షాక్ కాదు.. సైన్స్ కాంగ్రెస్ రూపంలో ఉస్మానియా విద్యార్థులు ఇచ్చారు. వందేళ్ల సైన్స్ కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి ఈ తరహా షాక్ ను కేవలం తెలంగాణ సర్కారుకే తగిలిందంటే కారణం ఉస్మానియా విద్యార్థుల ఆక్రందనలే కారణంగా చెప్పవచ్చు.
Indian Science Congress

హైదరాబాద్ లోని ఉస్మానియాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు అనూహ్యంగా వాయిదా పడింది. ఉస్మానియా యూనివర్శిటీలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టేందుకు సర్కారు ఎప్పటినుంచో ఏర్పాట్లలో మునిగిపోయింది. ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 వేల మంది సైంటిస్టులు వస్తారని, వారందరికీ మంచి భోజనం అద్భుతమైన వసతి ఉండేలా చర్యలు తీసుకోవాలని సర్కారు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లలో మునిగిపోయింది. ఉస్మానియా విద్యార్థులకు నెలరోజులపాటు సెలవులు ఇచ్చి బయటకు పంపేందుకు కసరత్తు కూడా చేసింది. కొందరు విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా కూడా బలవంతంగా గెంటేస్తామని హెచ్చరించింది. అయితే ఈ సదస్సు వాయిదా వేస్తున్నట్లు సైన్స్ కాంగ్రెస్ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. ఉస్మానియాలో జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న సదస్సును వాయిదా వేస్తున్నట్లు సైన్స్ కాంగ్రెస్ తన వెబ్ సైట్ లో సమాచారం పోస్టు చేసింది.

యూనివర్శిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే సదస్సు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. యూనివర్శిటీలో తెలంగాణ సర్కారుపై విద్యార్థులు రగిలిపోతున్నారని, ఈ పరిస్థితుల్లో సదస్సు జరిగితే అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని సర్కారు భావించింది. అందుకే ఓయూ వైస్ ఛాన్సెలర్ చేత ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ సదస్సును నిర్వహించడం కష్టమని నివేదిక ఇప్పించిచారని తెలిపింది. ప్రధాని మోదీ కూడా ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, శాంతి భద్రతలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్టు సైన్స్ కాంగ్రెస్ వర్గాలను కలవరపాటుకు గురిచేసింది. దీంతో  సదస్సును వాయిదా వేశారు. 11 ఏళ్ల తర్వాత సైన్స్ కాంగ్రెస్ హైదాబాద్ లో జరగాల్సి ఉంది. గత వందేళ్లలో సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడటం ఇదే తొలిసారి. గత ఏడాది ఈ సదస్సు ఏపీలోని ఎస్వీ యూనివర్శిటీలో నిర్వహించారు.

ఇటీవలే మురళి అనే విద్యార్థి ఓయూలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో, అక్కడ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు, నాన్ టీచింగ్ స్టాఫ్ నిరవధిక దీక్షలు చేస్తున్నారు. ఇంకొకవైపు లంబాడాలు-ఆదివాసీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఉద్యోగ నోటిపికేషన్ల కోసం యువత పెద్ద ఎత్తున ఉస్మానియా కేంద్రంగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మార్పీఎస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతోంది. వీటికి సంబంధించిన విద్యార్థులు యూనివర్శిటీలో ఏ క్షణంలోనైనా ఆందోళన చేసే ప్రమాదముందని గుర్తించి వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో ఉద్యోగాల జాతర సాగి తామందిరికీ కొలువులొస్తాయని నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. దీంతో నిరుద్యోగులు గత మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉస్మానియాలో పోరాటాలు తీవ్రంగా ఉన్నాయి. గతంలో జరిగిన వందేళ్ల ఉస్మానియా వేడుకల్లో విద్యార్థులు ఆగ్రహావేశాలు ఎంతగా ఉన్నాయో సర్కారు స్వయంగా చవిచూసింది. దీంతో ఆ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడకుండానే వెనుదిరిగిన పరిస్థితి ఉంది. విద్యార్థుల వ్యతిరేకత కారణంగానే కేసిఆర్ మాట్లాడకుండా ఉస్మానియా నుంచి వెనుదిరిగినట్లు చెబుతున్నారు.  అప్పట్లో నిరుద్యోగుల్లో ఇంత ఆగ్రహం లేదు. కొందరికి సర్కారు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తుందేమోనన్న ఆశ ఉంది. అందుకే ఆ సమయంలో విద్యార్థుల ఆందోళనను సర్కారు కంట్రోల్ చేయగలిగింది. కానీ ఇప్పుడు విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి మరింత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందన్న భయంతోనే విసి చేతులెత్తేశారని తెలుస్తోంది. ఒకవేళ సదస్సు జరిగి తీరా విద్యార్థులు ఆందోళన చేస్తే… ప్రపంచం ముందు తెలంగాణ సర్కారు అవమానాలపాలవుతుందన్న అంచనాతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

మొత్తానికి ప్రపంచ తెలుగు మహాసభలు, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును విజయవతంగా చేపట్టి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న తెలంగాణ సర్కారుకు సైన్స్ కాంగ్రెస్ జరపలేకపోయారన్న అపవాదు మూటకట్టుకుంది. సైన్స్ కాంగ్రెస్ జరిగే వేళ ఏదైనా గొడవలు జరిగితే తెలంగాణ యూనివర్శిటీల్లో ఉన్న అశాంతి భారతదేశానికే కాకుండా సరిహద్దులు దాటుతుంది… అందుకే ఈ నిర్ణయం…

Categories
Jobs/TSPSC Sucides

సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగి ఆత్మహత్య

Unemployed suicide  sirisilla
Unemployed suicide sirisilla
Categories
Govt Failures Jobs/TSPSC

​త్వరలో 3000 పోస్టుల భర్తీ // నమస్తే తెలంగాణలో వార్త

👉రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణ వాటాకు వచ్చిన ఉద్యోగాలు (అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం): 5,23,675.

👉అప్పటికి రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు: 3,15,849.

👉ఈ మూడేళ్లలో రిటైరైన ఉద్యోగులు సుమారు: 46,000.

👉అంటే ప్రభుత్వ శాఖలలో  ఉన్న మొత్తం ఖాళీలు: 2,53,826

👉ఇవికాక, ఆర్టీసీ, సింగరేణి, ట్రాన్స్కో, జెన్కో వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న ఖాళీలు సుమారు: 50,000

👉మొత్తం కలిపితే మొత్తం ఖాళీలు సుమారు: 3,00,000 
👉ఈ మూడేళ్లలో భర్తీ చేసిన ఖాళీలు సుమారు 20,000.👉రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 21 జిల్లాలు, 125 మండలాలు, 25 రెవిన్యూ డివిజన్లు, అనేక గురుకులాలు… ఏర్పడ్డాయి. వీటికి అదనంగా సుమారు 20,000 అదనపు పోస్టులు అవసరం.

👉అంటే ఇంకా భర్తీ కానీ ఖాళీలు సుమారు 3,00,000 పైనే

👉ఇప్పుడు…మూడేళ్ళ తరువాత 3,000 పోస్టులకు నోటిఫికేషన్లు వేస్తారట…

👉అంటే మొత్తం ఖాళీలలో 1%…

👉అదికూడా “త్వరలో”…

మురిసిపోదామా?

Categories
Public Voice

KCR పాలన ఒక పిట్ట కథ లో 

ఔరంగజేబ్ వారసుల్లో జహందర్ షా అని ఒకడుండే వాడు…

ఒక సం”రం పాటు అధికారం కూడా వెలగబెట్టాడులెండి..

ఏక్ నంబర్ తాగుబోతు,తిరుగుబోతు…

వాడికి అధికారం దక్కేటప్పటకి లాల్ కున్వర్ అని ఓ లపాకీ ఉండేది…

ఓ రోజు లాల్ ఖిల్లా మీద ఇద్దరూ నిలబడి ఉండగా దూరంగా యమునా నదిలో ఎనభైమందితో వెళ్ళే పడవ ఒకటి లపాకీ లాల్ కున్వర్ కంటబడింది..

అది చూసి సుల్తాన్ తో ఇలా అంది

“సుల్తాన్ సాహెబ్ నా కళ్ళతో ఎన్నో అద్భుతాలను చూసాను కానీ నదిలో వెళ్ళే పడవ మునగడం అందులో జనాల హహకారాలు చూడలేదండీ” అంది.

“ఓహో!! మై డియర్ లపాకీ లాల్ కున్వర్ అదేమంత భాగ్యం.. ఇప్పుడే చూపిస్తా ఉండు” అని చెప్పి వెంటనే భటులను పురమాయించి పడవను ముంచేయించాడు..

పడవలో ఉన్న డెబ్భైయ్యొక్క మంది తనువు చాలించగా తొమ్మిదిమంది బ్రతుకుజీవుడా!! అంటూ బయటపడ్డారు..

సాని కోరిక మేరకు ఎన్నో గుండె”కోతలు” మిగిల్చిన మహానుభావుడు ఈ జహందర్ షా…

సాని కళ్ళలో ఆశ్చర్యాన్ని చూసి ఆనందపరవశుడయ్యాడు..

వాడికి తగ్గవాడే మన ముఖ్యమంత్రి కచరా…

మూడు దశాబ్దాల తన రాజకీయజీవితానికి,పదమూడేళ్ళ ఉద్యమజీవితానికి(!?) కానుకగా లభించిన తెలంగాణా అధికారాన్ని సానిలా చూస్కుంటున్నాడు..

అమరుల త్యాగాలతో గద్దెనెక్కిన కచరా..

నేడు నిరుద్యోగుల ఆకలికేకలతో..

అన్నదాతల ఆక్రందనలతో..

తన అధికారదాహాన్ని సంతృప్తిపరచుకుంటూ..

కాలం వెళ్ళదీస్తున్న ఈ నయా నియంత నాటి ఔరంగజేబు మనవడు జహందర్ షా కు ఏమాత్రం తీసిపోడు..

Post by#హేము