Categories
Govt Failures Jobs/TSPSC News Victim Voice

OU లో MSc విద్యార్థి మురళి ఆత్మహత్య


ఓయూలో విద్యార్ధి ఆత్మహత్య కలకలం రేపింది. మానేరు హాస్టల్‌ సమీపంలో మురళి అనే ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్ధి ఆత్మహత్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మురళీ మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. విద్యార్ధి మృతదేహం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Watch video here

*ఓయూలో MSc physics 1st year విద్యార్థి మురళి ఆత్మహత్య.ఉద్యోగాల నోటిఫికేషన్లు రావటం లేదని మనస్తాపం తో మానేరు హాస్టల్ బాత్రూమ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మురళి*.

*సిద్దిపేట్ జిల్లా జైదేవ్ పూర్ మండలం దౌలాపూర్ గ్రామం,బిసి డి ముదిరాజ్ సామాజికవర్గం*

*సుసైడ్ నోట్ మాయం పోలీసుల పై విద్యార్థుల అనుమానం?*

*50లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించాకే మృతదేహాన్ని మానేరు హాస్టల్‌ నుండి పోస్టుమార్టమ్ తరలించాలని నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్ డిమాండ్*

*సిఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కి చెందిన ఓయూ విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకోవడం కెసిఆర్ ప్రభుత్వానికి సిగ్గుచేటు*

*సిఎం కెసిఆర్ కి మురళి ఆత్మహత్య తోనైనా కనివిప్పు కలగాలి*

*రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యల బాట పట్టకముందే ఖాళీగ ఉన్న 2లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఒకే సారి విడుదలచేయాలి. నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్*

విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికి వరకు సైలెంట్‌గా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి ఆత్మహత్యతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం మహబూబ్‌నగర్‌లో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న ‘కొలువుల కొట్లాల సభ’ నేపథ్యంలో విద్యార్థి ఆత్మహత్య సంచలనంగా మారింది.

Categories
Govt Failures Jobs/TSPSC News

బీఈడీ సర్టిఫికేట్ అమ్మకానికి పెట్టిన నిరుద్యోగి

ఇది నా బీఈడీ సర్టిఫికేట్.. అమ్ముతాను..ఎవరైనా కావాలంటే చెప్పండి ఇస్తా.. మీరిచ్చిన డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి donate చేస్తా …తెలంగాణ ప్రభుత్వం దీనితో నాకు ఏమి ఉపయోగం లేకుండా చేసింది..మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది..నేను బీఈడీ చదివే రోజుల్లో నాకు ఫీజు రీయింబర్స్ కూడా రాలేదు..మంచి ర్యాంక్ తో సొంత డబ్బులతో ఫీజు కట్టి చదువుకున్నా పంతులు ఉద్యోగం కొలువు చేద్దామని..మంచిగ పూర్తి చేసిన..ఇక పంతులు కొలువు ఎప్పుడెప్పుడు సాధిద్దామా అని ఎదురుచూసిన..అప్పుడు టెట్ అని ఇంకో మెలిక పెట్టిర్రు..దాంట్లో 60%మార్కులు రావలంట..సరే అదికూడా చదివిన 72% మార్కులు తెచ్చుకున్న..2012 dsc రాసిన 72 మార్కులు వచ్చినాయి..ఉద్యోగం రాలే..అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది..ఉమ్మడి Ap ప్రభుత్వం మరో Dsc నోటిఫికేషన్ కి సిద్ధపడింది..మా తెలంగాణ లో మేమేసుకుంటం అని ఉద్యమంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నం.. ఎప్పుడెప్పుడు dsc నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూసినం…మూడేళ్లకు కానీ మన ప్రభుత్వానికి మూడు రాకపాయే..సరే ఇప్పుడు వచ్చింది.మన ప్రభుత్వంలో పంతులు కొలువుకోసం చదువుతున్న. కానీ మన ప్రభుత్వం డిగ్రీ లో 50% మార్కులు ఉంటేనే exam రాయాలని మెలిక పెట్టింది. నేనెప్పుడో 2008 లో డిగ్రీ పూర్తి చేసిన..నాకు 48.25% మార్కులు వచ్చాయి..అప్పుడే బీఈడీ కి అర్హత లేదంటే వేరేది చదువుకొనే వాడిని.. బీఈడీ చేసి 2 సార్లు టెట్ రాసి, ఒకసారి dsc రాస్తే…ఇప్పుడు నేను అర్హుడిని కాదంట.. ఇదెంత వరకు న్యాయమో మీరే చెప్పండి..36% మార్కులు వచ్చిన వాడు కలెక్టర్ అవ్వచ్చు..గ్రూప్ 1 & 2 ఎంప్లాయీస్ అవ్వచ్చు.. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నాకు అర్హత లేదంటారా.మరి పక్కనున్న Ap dsc lo అందరికీ అవకాశం ఇచ్చింది.. నాకు PG లో 75% మార్కులున్నయి..నేను అర్హుడుని కాదా..కనీసం ప్రైవేట్ టీచర్ గా కూడా పనికిరానని మన ప్రభుత్వం certifie చేసింది నన్ను…అలాంటప్పుడు ఎందుకు నాకీ మెమో.. ప్లీజ్ ఎవరైనా కొనండి నా మెమో..నా మీద జాలి తో అయిన…ఆ డబ్బు కచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తా…నేను ఇప్పటికీ రెండు PG లు చేసా…ఆ మెమోలు కావాలన్న ఇస్తా…ఎవ్వరూ కొనకపోతే కోదండరాం సార్ సమక్షంలో యూనివర్సిటీ వారికి రిటర్న్ చేస్తా…నేను ఎవ్వరి మీద కోపంతో ఈ మాటలు చెప్పట్లేదు…ఒక నిరుద్యోగిగా…నా బాధ చెప్పుకున్నా…

Categories
Govt Failures Jobs/TSPSC

TSPSC శల్య సారధ్యం

లక్ష ఉద్యోగాల కాంక్షతో పోరాడిన ఉద్యమం,తెచ్చుకున్న రాష్ట్రం..ఏర్పాటు చేసుకున్న కమీషన్..దానికి అత్యంత ప్రతిభావంతుడు, ఉద్యమకారుడు ఛైర్మెన్..అంతే ఉద్దండపిండాలైన సభ్యులు.మరి అటువంటప్పుడు ఆ సర్వీస్ కమీషన్ పనితీరు ఏ రేంజ్ లో ఉంటుంది..ఇవన్నీ చెపుతుంది టీఎస్పీఎస్సి గురించే.పేపర్ మీద పులులు అని ఒకప్పుడు భారత క్రికెట్ టీమ్ ను అనేది.ఇప్పుడు ఆ వ్యాఖ్య టీఎస్పీఎస్సి కి అచ్చుగుద్దినట్టు సరిపోయితుంది.ప్రభుత్వం ఒక వైపు నియామకాలకు అనుమతులు ఇస్తున్నా,సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది మొదలు వివాదాలు చుట్టుముడుతున్నాయి.లోపాలు ఒక్కసారి జరిగితే ఒకే కానీ ప్రతీ నోటిఫికేషన్ మీద వివాదాలు రావడానికి అసలు కారణాలు ఏంది??సభ్యులకు ఛైర్మెన్ కు మధ్య మనస్పర్థల?లేక కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమం లోలోపల జరుగుతోందా??నీళ్లు,నిధుల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన కేసీఆర్ టీమ్ అసలు సిసలు మాటైన లక్ష ఉద్యోగాల విషయంలో ఇంకా ఎందుకు తడబడుతున్నది??వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మీద తీవ్ర ప్రభావం చూపే కొలువుల విషయంలో అసలు టీఎస్పీఎస్సి ఇంకా మొద్దు నిద్ర ఎందుకు వీడడం లేదు.అన్ని నాకే తెలుసు అనే ఛైర్మెన్ బిరుసుతనమా?లేకా సభ్యులు,ఛైర్మన్ మధ్య సమన్వయ లోపమా??ఒకప్పుడు ఏపీపీఎస్సి మీద ఉండే ఉక్రోషం కంటే ఎక్కువ ఇప్పుడు టీఎస్పీఎస్సి మీద ఉంది.సర్వీస్ కమీషన్లు అన్నీ ఇంతే అనే స్థాయికి దిగజారిపోయింది టీఎస్పీఎస్సి..

టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన టీఆర్టీ నోటిఫికేషన్ వివాదాస్పదమవుతోంది. ఇప్పటివరకు నోటిఫికేషన్లు పాత జిల్లాల ప్రకారం విడుదల చేసి.. టీచర్‌ పోస్టులు కొత్త జిల్లాల ప్రకారం ప్రకటించడం ఎంతవరకు సమంజసమని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇవ్వడం అభ్యర్థులకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. జిల్లాల పెంపుతో స్థానికతకు ఏమాత్రం భంగం వాటిల్లదని వాదిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చెబుతోంది. అయితే కొత్త జిల్లాల వారీగా పోస్టులు ప్రకటించడం..కొన్ని జిల్లాలకు పోస్టులు కేటాయించకపోవడం అక్కడి అభ్యర్థులను తీవ్రమనోవేదనకు గురిచేస్తోంది. అయితే స్థానికేతరులకు 20శాతం అవకాశం ఉండటం వల్ల కొంతమేర ప్రయోజనం ఉంటుందని విద్యార్థి, యువజన సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

గ్రూప్‌2 పరీక్షల్లో వైటెనర్‌ విషయంలో తెలివితక్కువగా వ్యవహరించిందన్న ఆరోపణలున్న టీఎస్పీఎస్సీ, ఇటు గ్రూప్‌1 ఫలితాల వెల్లడిలోనూ ఏకంగా టాప్‌ ర్యాంకర్‌ల పోస్టింగ్‌లనే సరిచూసుకోలేక పోయిందంటే కమిషన్‌ ఆదినుంచీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందంటున్నారు విద్యార్థులు. అయితే, ఇప్పుడు కమిషన్‌ నెపాన్ని సీజీజీ పైకి నెడుతోంది. నిజానికి కమిషన్‌కు సమర్ధులైన సభ్యులను నియమించినప్పటికీ లోపాలు జరుగుతుండడం గమనార్హం. పైగా టీఎస్పీఎస్సీ కూడా అక్రమాలు అవకతవకల కమిషన్ అన్న ముద్ర వేసుకుంటోందనే ఆందోళన అప్పుడే మొదలైంది. ఇన్నేళ్లలో సక్సెస్‌ఫుల్ గా నిర్వహించిన పరీక్ష గాని ఫలితాలు గాని లేకపోవడాన్ని అభ్యర్థులు తప్పుబడుతున్నారు. ఇదే తీరు కొనసాగితే ఉమ్మడి రాష్ట్రంలో ఏపిపిఎస్‌సికి పట్టిన గతే టీఎస్పీఎస్సీకీ పడుతుందని అభ్యర్ధులు హెచ్చరిస్తున్నారు. అటు ప్రభుత్వంలోని పెద్దలు కూడా పైకి కమిషన్‌ను మెచ్చుకుంటున్నా.. అంతర్గతంగా, వారి పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Categories
KCR Flip-Flops

Nizam Sarkar = (K)ha(C)im(R)azvi Sarkar

☪నిజాం ప్రభువు చాల గొప్పవాడు….ఎందుకంటే?
☪మన ఆడవాళ్ళును నగ్నంగా బతుకమ్మ లాడించినందుకు.
☪మన ఆడవారి ఆరు టన్నుల పుస్తెలు(మంగళసూత్రాలు) తన ఖజానాలో జమ చేసినందుకు.
☪పంటలు పండిన,పండకపోయిన హింసించి అయినా పన్ను వసూలు చేసినందుకు.
☪కొందరినైన హిందువులను మతం మార్చినందుకు.
☪చదివితే ఉర్దూలోనే చదవాలని ఉర్దూ పాఠశాలలు పెట్టినందుకు.
☪ప్రజాధనంతో రామాలయం కట్టిస్తే, రామదాసును జైలులో పెట్టి నానహింసలు పెట్టినందుకు.
☪నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ పోరాటం చేసిన ప్రజలను చంపించినందుకు.
☪రజాకార్లు ఊళ్ళమీద పడి బీభత్సం సృస్టిస్తూ ప్రజల మాన,ప్రాణాలు తీస్తూ దోపిడీలు చేసినందుకు.
☪హిందువులు 95% ఉండికూడ నిర్భయంగా స్వేచ్ఛా వాయువు పీల్చలేని పాలనలో జీవించినందుకు.
☪రాజ్యంలోని భూమిని తన తొత్తులైన జమీందారులకు,దేశ్ ముఖ్ లకు ఇచ్చి, వాళ్లు ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకున్నందుకు.
☪స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ సంస్థానాన్ని భారత్‌లో కాకుండా పాకిస్తాన్ లో విలీనం చేస్తా అన్నందుకు.
☪మా సంస్థానాన్ని విలీనం చేయమని వత్తిడితెస్తే ఇక్కడ ఉన్న హిందువుల భార్య బిడ్డలను చంపివేస్తామని కాసిం రజ్వీతో డిల్లీ పెద్దలను బెదిరించినందుకు.
☪ప్రజలు నెత్తుర్ని చెమటగ మార్చి పన్నులు కట్టిన ఆదాయంతో తన ఉంపుడుగత్తెలకు కూడా మిద్దెలు,భవనాలు కట్టుకొని కులుకుతూ విలాసవంతమైన జీవితం గడిపినందుకు.
☪ జమీందారు, మరియు దొరలు వయస్సులో ఉన్న, తమకు నచ్చిన,కొత్తగా పెళ్ళయిన ఆడవారిని రాత్రికి తన పక్కలోకి పంపు, లేకపోతే ప్రాణాలు గాలిలో కలిసిపోయని బెదిరించినపుడు , ఆ దుస్థితిలో ఏమిచేయాలి,ఎవరితో చెప్పాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఆర్ధనాదలు,రోదనల నడుమ కాలంగడిపిన పాలన ప్రజలకు
అందించినందుకు.

🙊కె సి ఆర్ సారుకూడ చాల గొప్పవాడు….ఎంత అంటే?
🙊అబద్దాలంటే అసలు తెలియవు, సాక్షాత్తు సత్యహరిచంద్రుని మనుమడు.
🙊ఉద్యమకాలంలో బంగారు తెలంగాణ అనే స్వర్గాని అరచేతిలో చూపించినందుకు.
🙊లక్ష కుటుంబాలలో ఒకొక్క ఉద్యోగం ఇచ్చి తమ కుటుంబంలో ఒక్క ఉద్యోగం కూడా తీసుకోనందుకు.
🙊ఓడదాటెదాక కోదండ రాముడు బంగారం, దాటినాక తాడుబొంగరం లేని రామ్,అని అన్నందుకు.
🙊నిరుపేదలకు డబుల్ చెప్పి, లక్షల్లో త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ ఇచ్చినందుకు.
🙊 కె జి టు పి జి ఉచిత విద్యనిచ్చినందుకు.
🙊విద్యార్థులను విస్మరించకుండా వాళ్ళకు తగిన గౌరవం ఇచ్చినందుకు.
🙊ప్రపంచంలో ఉన్న ముఖ్య పట్టణాలను మన రాష్ట్రానికి తెచ్చినందుకు.

ఎంతని చెప్పాలి,ఏమని చెప్పాలి వీరి గొప్పతనం,
రాస్తే చాట భారతం,చూస్తే అగాధం, ఒకరుమించింనవారు,మరొకరు
ఏడవ నిజాం ప్రభువు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న వాడు మన ఎనిమిదవ కెసిఆర్ ప్రభువు.
నిజాం పాలనను మురిపిస్తూ మరిపిస్తానంటున్న ఆదునిక తెలంగాణ ప్రాంత అభినవ పిచ్చి తుగ్లక్ కెసిఆర్ సారు పాలన.

Categories
News Political Curruption

మరో వివాదంలో TRS MLA ముత్తిరెడ్డి

మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచర్ల గ్రామంలో ఉన్న సర్వే నం.51 లో ఉన్న 22 గుంటల భూమిని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేశారు అంటూ గోగికర్ సంతోష్ కుటుంబ సభ్యులతో ధర్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలని కుటుంబ సభ్యుల ఆవేదన

.

Categories
KCR Flip-Flops News

తెల్శినోనికి తెల్కపిండి తెల్వనోనికి గానుగపిండి అన్నట్టుంటయి మన కేసీఆర్ ముచ్చట్లు

మా ఊళ్లే ఓ తాతకు కోళ్లఫారం ఉంది. ప్రతి దసరా పండక్కి ఓ కోళ్ల బ్యాచ్ ఒచ్చేటట్లు కోడిపిల్లల్ని ఏసేటోడు. ఊరంతా దసరా పండగ రోజు గాన్నే కోళ్లు కొనుక్కునేటోళ్లు. ఓ ఏడు తాత గ్యాసారం బాగాలేక దసరా పండగ 2 రోజుల ముందు గట్టిగా వాన పడి కోళ్లఫారం సగం కూలిపోయింది. దానివల్ల సగం కోళ్లు సచ్చిపోయినై. దసరా నాడు కోళ్లు కొందామని పోతే నూరుకు అమ్మాల్సిన కోడి ₹200 అన్నాడు. గదేంది తాత ₹100 నే కదా ₹200 అమ్ముతున్నావంటే ప్రతి దసరాకి 1000 కోళ్ల దాకా అమ్మేటోన్ని కని నా దగ్గర 500 ఉన్నాయి అందుకే ఇప్పుడు ₹200 ఒకటి అమ్ముతున్నా అన్నాడు. ఎం చేస్తాం ముసలోనికి నష్టం వచ్చింది, గట్లే గిరాకీ కూడా పెరిగిందని ఆయన చెప్పిన ధరకి కోళ్లను కొనక్కపోయారు ఊరంతా….

ఇప్పుడు గదంతా ఎందుకు చెప్తున్నా అనే కదా మీ సందేహం. గదే చెప్తున్నా

అమెరికాల హర్రీకెన్లు 2-3 సార్లోచ్చి పత్తి అధికంగా పండే ప్రాంతాలన్నీ నీళ్ల కొట్టుకపోయినై. మనదగ్గర కూడా అదేదో #అడ్డమైన #గులాభిరంగు_పురుగు సోకి, కల్తీ విత్తనాల వల్ల దిగుబడి చాలా తగ్గిపోయింది. గిసొంటి సమయం ల పత్తి ధర అంతర్జాతీయ మార్కెట్లో పెరగాలి కదా.మార్కెట్లో కావాల్సినంత లేకపోతే ఆటోమేటిక్ గా ధరలు పెరుగుతాయి. అది కొన్ని 100ల ఏండ్లనుండి జరుగుతున్న వాస్తవం.

కానీ మన ముఖ్యమంత్రి సారేమో అమెరికాల హర్రీకెన్లు ఒచ్చినయ్ కాబట్టి మనదగ్గర పత్తికి మద్దతు ధర లేదు అంటాడు ..

ఏందో ఈ మహానుభావుల మాటలు ఎవ్వరికీ అర్థం కావు😂😂😂

దొర, పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్ కి ₹4320, ప్రభుత్వం ఇంకా 50% కల్పి మొత్తం క్వింటాకి ₹6500 ఇస్తామని చెప్పారు. కని మన #గులాభి మార్కెట్ కమిటీ చైర్మన్లు అటు అధికారులు, ఇటు దళారులతో కుమ్మక్కై క్వింటాకీ ₹1500-₹4000 కంటే ఎక్కువ ఇస్తలేరు. ఈ ఘోరాలను తట్టుకోలేక, కడుపు మండి మార్కెట్ యార్డ్ లో జరంత లొల్లి చేస్తే వాళ్ళ ఆవేదనని సాటి రైతుగా అర్థం చెస్కోని దళారుల ఆగడాలు అరిక్కట్టాల్సింది పోయి పోయినేడు సిగ్గులేకుండా బేడిలేసి ఆ రైతుల మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని బెదిరింపులకు దిగితిరి. ఏ మార్కెట్లో చూడు అదే గొడవ.ఇయ్యాల కూడా గద్వాల్ మార్కెట్లో అందరూ కుమ్మక్కై పల్లి రైతులకు సగం ధర కూడా ఇవ్వకుంటే వాళ్ళు మార్కెట్ యార్డ్ మీద దాడి చేసిర్రు.నీకు అలవాటే కదా వాళ్ళమీద కూడా ఏదో దేశద్రోహం కేసువెట్టి లోపల నూకు. రైతు మార్కెట్లో ఉన్నప్పుడు మార్కెట్ కష్టాలు పట్టించుకోక 24 గంటలు కరెంటు ఇస్తున్నాం మాది రైతు ప్రభుత్వం అని అన్నీ బజార్లో వదిలేసి చెప్పవడ్తిరి…

గతంలో ఇంత బాధ్యతారాహిత్యాన్ని ఏ ప్రభుత్వం లో చూళ్ళేదు😣😣😣😐😐😐

అమెరికా లో హర్రీకెన్లు అక్కడి పంటకు నష్టం కలిగించడం వల్ల అంతర్జాతీయ పత్తి వ్యాపారులు భారతదేశం వైపు చూస్తున్నారని #REUTERS అనే సంస్థ రాసిన కథనం మీ కోసం.

Categories
Songs

చీము నెత్తురు కరాబైన ఓరి సిగ్గు శరం లెనోడా…. ఓరి తాగుబోతోడా…

నిన్ను తరిమి కొడుతము రా… ఓరి తాగుబోతోడా…
చీము నెత్తురు కరాబైన ఓరి సిగ్గు శరం లెనోడా….

Categories
News Polical Saga

కె టి ఆర్ ఇజ్జత్ తీసిన వాస్తవాలు

కొలువుల కొట్లాట సభకు కోదండరాం పెర్మిషన్ అడగలేదు

Categories
News

కొత్త పార్టీ కోసం సిద్దమవుతున్న కోదండరాం

Categories
Govt Failures News Public Voice

ఓ వైపు గులాబీ పురుగుల దొరల పోటు, మరోవైపు దోమ పోటు

ఓ వైపు గులాబీ పురుగుల దొరల పోటు, మరోవైపు దోమ పోటుతో దగాపడి, పండించిన పంటకు మంట పెడుతున్న రైతన్నలు.
మేము పండించే పంటలకు మద్దతు ధర కల్పించండి, ఆరుగాలం శ్రమించి ఆత్మగౌరవంతో బ్రతుకుతాం.
మా కష్టానికి విలువ ఇవ్వకుండా మీరు వేసే బిచ్చానికి అలవాటు చేసి మమ్మల్ని మీలా లచ్చగాళ్లను చేయకండి
దొరా.. నువ్వు ఇవ్వాలనుకునే 4 వేలతో నీలాగ పట్నంలో లో పండుకొని ఫామ్ హౌస్ లో పార్టీలు చేసుకునే వాళ్ళకే ఉపయోగం.