Categories
KCR Flip-Flops

తెలంగాణ వాదులారా ఇకనైనా మేల్కొందాం

దళితుడు మొదటి ముఖ్యమంత్రి
అంటే “నమ్మినం”.
ఉప ముఖ్యమంత్రి ని చేస్తే
“సర్దుకున్నాం”.
చెప్పకుండా రాజయ్య ను దించితే
“ఓర్చుకున్నాం”.

లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలిం సిటీ ని
దున్నుతా అంటే “నమ్మినం”.
సాక్ష్యాలు ఏమీ లేవు కదా అంటే
“సర్దుకున్నాం”

అక్రమ కట్టడాలు కూల్చివేస్త అంటే
“నమ్మినం”
అన్నమయ్య రామన్న మిత్రులే కదా
అని “సర్దుకున్నాం”

ఆంధ్ర మీడియా ను బొందపెడుతా అంటే
“నమ్మినం”
బొంద ఎందుకు అని నయీం డైరీకి
గోరీ కడితే “సర్దుకున్నాం”

అవినీతి జరిగితే కొడుకుని గూడ వదలను అంటే “నమ్మినం”
మియాపూర్ స్కాం లో బిడ్డ లేదు కదా అని “సర్దుకున్నాం”

తెలంగాణ తెచ్చుకున్నది కడుక్కుని తాగటానికి కాదు అంటే “నమ్మినం”
విలాస భవనాలు, వాస్తు, యాగాలు
విశ్వనగరం కొరకే అని “సర్దుకున్నాం”

రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అంటే
“నమ్మినం”
మల్లన్నసాగర్ లో అందరూ రాజు లే అని “సర్దుకున్నాం”

కోదండరాం సార్ ఎంత ముద్దుగున్నడూ
అంటే “నమ్మినం”
రామోజీ కి ఉన్న విజన్ లేక కాళ్ళ కు అడ్డుపడుతుండు అని “సర్దుకున్నాం”

కానీ

ప్రజల గొంతుక అయి మాట్లాడుచున్న
కోదండరాం సార్ ను పదేపదే అరెస్టు ల పేరుతో అగౌరవ పరిస్తే “ఊరుకోం”

నాయిని నర్సింహారెడ్డి ని టీవీ చానల్ చర్చ లో కొట్టిన పట్నం మహేందర్ రెడ్డి,

ఖమ్మం లో తెలంగాణ వాదాన్ని లేకుండా చేసిన తుమ్మల నాగేశ్వరరావు,

హైదరాబాద్ లో కేసీఆర్ ను అడుగు పెట్టకుండా చూస్తానని చెప్పిన
తలసాని శ్రీనివాస యాదవ్,

ఉప ఎన్నికలో తెలంగాణ వాదం లేదని చెప్పేందుకు ఎన్నికల బరిలోకి దిగిన
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,

వీళ్ళంతా రాష్ట్రం వచ్చిన తరువాత మంత్రులు అయ్యారు.

తెలంగాణ వాదులపై రాళ్ళ వర్షం కురిపించిన కొండా సురేఖ,

న్యాయవాదులను ఫుట్ బాల్ ఆడిన
తీగల కృష్ణారెడ్డి,

మెదక్ లో విద్యార్థులను చితకబాదిన
మైనంపల్లి హన్మంతరావు,

నిజామాబాద్ లో జగన్ వాదం వినిపించిన బాజిరెడ్డి గోవర్ధన్,

వీరంతా శాసనసభ్యులూ ఆయ్యారు.

డి.శ్రీనివాస్ ఉప ఎన్నికలలో ఓడిపోతే తను బలిదానం అవుతానని ఇషాంత్ రెడ్డి డి.శ్రీనివాస్ ఓడిపోగానే బలయ్యారు
డి.శ్రీనివాస్ మాత్రం రాజ్యసభ సభ్యులయ్యారు.

వీరంతా కరుడుగట్టిన తెలంగాణ వాదులు ఆయ్యారు.

ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో క్రియాశీలక భూమిక పోషించి
“సకల జనుల” అందరితో సమ్మె చేయించి హుస్సేన్ సాగర్ తీరాన తెలంగాణ ప్రజలతో “మిలియన్ మార్చ్”
చేయించి తెలంగాణ ఆకాంక్ష ను ఢిల్లీ కి పంపించిన కోదండరాం సార్ అవకాశవాది అయ్యారా….?

నచ్చితే నజరానా….
లేకుంటే జరిమానా నా…..?
ఎంతైనా
ఓడలో ఉన్నంత సేపు ఓడ మల్లన్న
లేదంటే బోడ మల్లన్న
ఇదీ మీ నైజం

తెలంగాణ వాదులారా ఇకనైనా మేల్కొందాం.

Categories
Songs

Epuri Somanna New Song on TJAC

Categories
Songs

TJAC // Spoorty Yatra Song

TJAC Spoorty Yatra Song Written By Teenmar Mallanna

Categories
Govt Failures News

కెసిఆర్ తిట్లకు కోదండరాం సర్ సమాధానాలు

Categories
Govt Failures News

కెసిఆర్ ప్రభుత్వం కొలువులు ఎందుకు ఇస్తలేదో చెప్పిన కోదండరాం సర్

జోనల్ వ్యవస్థ లాంటి కీలక నిర్ణయాలలో ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య పూరిత వైఖరి కారణంగానే నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది …”కొలువుల కొట్లాట” దెబ్బకు మత్తు వదలి ప్రభుత్వం మళ్లీ జోనల్ వ్యవస్థపై ఆలోచించడం మొదలు పెట్టింది…వత్తిడి లేకుంటే మళ్లీ మత్తులోకి జారుకుంటుందీ ప్రభుత్వం… యువత సంఘటితంగా పోరాడి మన కొలువులు మనం సాధించుకుందాం…అంటున్న టీజేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం

Categories
News

సింగరేణి ఎన్నికలలో అధికార పక్షాన్ని ఓడిద్దాం // Kodandaram

సింగరేణి ఎన్నికలలో అధికార పక్షాన్ని ఓడిద్దాం… తెలంగాణకు తలమానికమైన సింగరేణిని కాపాడుకుందాం… ప్రొ. కోదండరాం

Categories
News

మేడిపల్లి దగ్గర కోదండరాం సర్ ను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీస్లు

Categories
Interview

Prof Kodandaram Interview with Theenmar Mallanna

కొలువులకై కొట్లాట సభ సందర్బంగా టీజేఏసీ చైర్మన్ ప్రో.కోదండరాం తో తీన్మార్ మల్లన్న పేస్ బుక్ లైవ్.

Categories
Govt Failures Nerella incident Victim Voice

దమన కాండపై కంట తడి పెట్టిన నేరెళ్ల దళిత కుటుంబాలు