Categories
Govt Failures News

ఓయూలో మందకృష్ణ మాదిగ నిర్భంధ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు

సామాజిక ఉద్యమాల‌ పితామహుడు, MRPS జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్భందించడం‌ కేసీఆర్ నిరంకుశ విధానాలకు నిదర్శనమని ఓయూలోని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ రోజు ఓయూలోని న్యూ సెమినార్ హాల్లో 30 విద్యార్థి సంఘాలు సమావేశమయ్యాయి. మందకృష్ణ మాదిగ గారి తక్షణ విడుదల కోసం ఈ సంఘాలన్నీ *మందకృష్ణ మాదిగ నిర్భంధ వ్యతిరేక కమిటీ*గా ఏర్పడ్డాయి. తర్వాత మీడియా సమావేశంలో కార్యచరణను ప్రకటించారు.

*కమిటీ సభ్యులు*

✍ కో ఆర్డినేటర్లు – కోట రాజేష్, డేవిడ్, పల్లెర్ల సుధాకర్.

✍ కన్వీనర్లు – ఆశప్ప (OUJAC), సలీంపాష (TVUV), సాంబమూర్తి (SFI), గ్యార నరేష్ (AISF), దర్శన్ (DBSA).

*కార్యాచరణ*

👉 జనవరి 22 న.

సోమాజికగూడ ప్రెస్ క్లబ్ లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలతో *రౌండ్ టేబుల్ సమావేశం*.

👉 జనవరి 23 న.

ఓయూలోని అన్నీ హాస్టల్లో *కరప్రతాలతో ప్రచారం*.

👉 జనవరి 24 న.

ఆర్ట్స్ కాలేజీ ముందు ఒక *నిరాహార రోజు దీక్ష*.

👉 జనవరి 26 న.

రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల ముందు *సంకేళ్లతో నిరసన ప్రదర్శన*.

👉 జనవరి 27 నుండి ఫిబ్రవరి 3 వరకు అన్నీ యూనివర్శిటీల్లో, జిల్లాలో నిర్భందాలకు వ్యతిరేకంగా *సదస్సులు*.

👉 ఫిబ్రవరి 4 న.

*ఛలో‌ ఉస్మానియా* పేరుతో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు భారీ బహిరంగ సభ.

—- *మందకృష్ణ మాదిగ నిర్భంధ వ్యతిరేక కమిటీ*

Categories
Govt Failures

కేసీఆర్ ప్రభుత్వానికి ఆలోజింపచేసే ఓపెన్ లెటర్ రాసిన రైతు బిడ్డ 

To,

The CM 

CC: All Ministers,

Sub: Save Agriculture

Respected Sir

రైతులకు ఎరువులు ఉచితం

వ్యవసాయానికి కరెంటు ఉచితం

రుణ మాఫీ

విత్తనాలు సబ్సిడీ

ఈ ప్రభుత్వంలో రైతులకు అన్నీ ఫ్రీ 

వీరికి ఇంకేం కావాలి , అని ప్రజల ఆలోచన

70%  వ్యవసాయం పై ఆధార పడ్డవారే , కాని వీరికి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి, 

అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని ప్రభుత్వ ఆలోచన

కానీ నేను ఒక రైతు బిడ్డగా చెబుతున్నా , 

మా రైతులకు ఏది ఫ్రీ ఫ్రీ ఫ్రీ గా ఇవ్వాల్సిన అవసరం లేదు అని విన్నవిస్తున్నా,

ఎందుకంటే ,

అంగన్ వాడి కార్యకర్తలను టీచర్లుగా ఎలా గుర్తించి 4,000 జీతం నుండి 10,000 జీతంగా పెంచావో,

1,500 జీతం ఉన్న సర్పంచ్ జీతం 5,000 చేసావో ,

75,000 జీతం ఉన్న MLA జీతం 1,50,000 చేసావో ,

విపరీతంగా పెంచిన గవర్నమెంటు ఉద్యోగుల జీతాలను ఏ విధంగా పెంచావో , 

అదే విధంగా , అదే శాతంతో సమానంగా రైతు పండించిన పంటకు ధరను నిర్ణయించి , ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలి.

ఎందుకు కొనుగోలు చెయ్యరు ప్రశ్నిద్దాం, పోరాడుదాం

లక్ష రూపాయల జీతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రోగం వస్తే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఫ్రీ , అతని పిల్లలకి ఫ్రీ , అతని భార్యకు ఫ్రీ మరియు అతని తల్లిదండ్రులకు కూడా ఫ్రీ

వారికి ఆఫీస్ టైం 9AM to 4:30PM , కచ్చితంగా టైం to టైం వెళతాడు , వస్తాడు.

మరి రైతు లేనిదే రాజ్యం లేదు , రైతే రాజు , రైతు లేకుండా జీవించలేము ,జై జవాన్ జై కిసాన్ , రైతు ఏడ్చిన రాజ్యం లేదు , ఎద్దు ఏడ్చిన ఎవుసం లేదు అని చెపుతున్న రాజకీయ నాయకుల్లారా ,

రాత్రనక , పగలనక , ఏ టైం లేకుండా , ఎప్పుడు పడితే అప్పుడు పొలానికి వెళ్లిన రైతు , తిరిగి వస్తాడో , లేదో తెలియక , ఇంటి దగ్గర ఎదురు చూసే భార్య , పిల్లలు , పంటకు రోగం , మనిషికి రోగం వస్తే ఎక్కడ చూపియ్య లో తెలియక , అప్పు చేసి , దిగుబడి తగ్గి కుంగిపోయే రైతులకు ఇస్తే ఫ్రీ అంటారు, ఉద్యోగులకు ఇస్తే ఇంక్రిమెంట్ అంటారు…

Please please feel it & Share it.. 🙏🙏                   ఇట్లు

మీ ఒక రైతు బిడ్డ

Categories
Govt Failures SCAMS

విద్యుత్‌ కొనకుండానే ఉత్త పుణ్యానికి రూ.957 కోట్లు చెల్లించిన రాష్ట్ర డిస్కంలు

ఉత్త పుణ్యానికి రూ.957 కోట్లు.. విద్యుత్‌ కొనకుండానే ఉత్పత్తి సంస్థలకు చెల్లించిన రాష్ట్ర డిస్కంలు.. డిమాండ్‌కు సరిపడా కరెంట్‌ కొనుగోలుకు ముందస్తు ఒప్పందాలు.. అంచనాలు తప్పి 4,910 ఎంయూల విద్యుత్‌ బ్యాక్‌ డౌన్‌.. కొనకపోయినా యూనిట్‌కు రూ.1.95 చొప్పున చెల్లించిన వైనం

కొనుగోలు చేయని విద్యుత్‌కు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు అక్షరాల రూ.957.45 కోట్ల చార్జీలు చెల్లిం చాయి. రాష్ట్ర అవసరాలకు కావాల్సిన విద్యుత్‌ సమీకరణకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న డిస్కంలు.. అంచనాలు తలకిందులవడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాయి. అంచనాలకు తగ్గట్లు డిమాండ్‌ లేక 2016–17లో 4,910 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను బ్యాకింగ్‌ డౌన్‌ చేయించాయి. ఒక్కో యూనిట్‌కు రూ.1.95 చొప్పున ఆ 4,910 ఎంయూలకు రూ.957.45 కోట్ల స్థిర చార్జీలు విద్యుదుత్పత్తి కంపెనీలకు చెల్లించాయి.

కొనకపోయినా ఎందుకంటే..

రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను అంచనా వేసి ఆ మేరకు విద్యుత్‌ సమీకరించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలతో డిస్కం లు ముందస్తుగా కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)లు చేసుకున్నాయి. దీంతో విద్యుత్‌ కొనుగోలు చేయకపోయినా ఉత్పత్తి కంపెనీలకు విద్యుత్‌ స్థిర చార్జీలు లేక జరిమానా డిస్కంలు చెల్లించాలి.

ప్లాంట్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన విద్యుదుత్పత్తి కంపెనీలు.. నిరంతరంగా ఉత్పత్తి చేసి అమ్మకాలు సాగిస్తేనే మనుగడలో ఉంటాయి. డిమాండ్‌ లేనపుడు ఉత్పత్తి తగ్గించాల్సి వస్తే కంపెనీలు నష్టపోకుండా తగ్గించిన విద్యుత్‌కు స్థిర చార్జీలు లేదా జరిమానా చెల్లించాలని ఒప్పందాల్లో పొందుç ³రుస్తారు. ఇలా డిమాండ్‌ లేనప్పుడు ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించుకోవడం లేదా నిలుపుదల చేయడాన్ని బ్యాకింగ్‌ డౌన్‌ అంటారు.  

కొంప ముంచిన ఓపెన్‌ యాక్సెస్‌..

రాష్ట్రంలోని భారీ పరిశ్రమలు, రైల్వేలు, వాణిజ్య సంస్థలు, ఇతర వినియోగదారులు 2016–17లో ఓపెన్‌ యాక్సెస్‌ ద్వారా బహిరంగ మార్కెట్‌ నుంచి 2,134 ఎంయూల విద్యుత్‌ కొనడం డిస్కంల కొంపముంచింది. విద్యుత్‌ చట్టం–2003లోని వెసులుబాటును ఉపయోగించుకుని డిస్కంలను కాదని బహిరంగ మార్కెట్‌ నుంచి తక్కువ ధరకు వినియోగదారులు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారు.

బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధరలు పతనమవడంతో 2015–16లో 902 ఎంయూలు ఉన్న ఓపెన్‌ యాక్సెస్‌ కొనుగోళ్లు 2016–17 వచ్చేసరికి 2,134 ఎంయూలకు పెరిగాయి. ఓవైపు నిరంతర విద్యుత్‌ సరఫరాకు డిస్కంలు పెద్ద మొత్తంలో విద్యుత్‌ సమీకరించగా.. కొందరు వినియోగదారులు ఓపెన్‌ యాక్సెస్‌కు వెళ్లడం, అంచనాలకు తగ్గట్లు డిమాండ్‌ లేకపోవడంతో 4,910 ఎంయూల విద్యుత్‌ బ్యాకింగ్‌ డౌన్‌ చేసుకొని నష్టపోవాల్సి వచ్చింది.  

నిరంతర విద్యుత్‌ సరఫరా కోసమే: డిస్కంలు  

నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం ముందస్తు ప్రణాళికలతో విద్యుత్‌ సమీకరించామని ఈఆర్సీకి డిస్కంలు వివరణ ఇచ్చాయి. 2015–16లో రాష్ట్ర గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 6,849 ఎంయూలు కాగా, 2016–17లో 9,191 ఎంయూలకు పెరిగిందన్నాయి. ముందస్తు ప్రణాళికల వల్లే డిమాండ్‌ పెరిగినా సరఫరా కొనసాగించామని సమర్థించుకున్నాయి. 

Categories
Govt Failures News

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు వాయిదా కి కారణాలేంటి…..? ప్రభుత్వ చేతగాని తనమా…?

విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వాలు… సైన్స్ కాంగ్రెస్ ను రద్దు చేసుకున్నాయి.

1. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీ            ఏమయ్యింది.

2. కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న 3 కోట్ల ఉద్యోగాల హామీ గుర్తుందా..

3. సైన్సు ను పాటించకుండా, మూఢనమ్మకాలతో పాలించే పాలకులకు… అసలు సమావేశాలను ప్రారంభించే నైతిక అర్హత లేదు.

4. విద్యార్థుల భాగస్వామ్యం లేకుండా… సైన్స్ కాంగ్రెస్ ను ఎలా నిర్వహించాలనుకున్నారు.

5. పరిశోధనలకు ల్యాబ్ లు కెటాయించని యూనివర్సిటీ అధికారులు… సైన్స్ ను ఎలా ప్రోత్సాహిస్తారు.

6. పరిశోధనా విద్యార్థులకు ఫెలోషిప్ లు ఇవ్వకుండా… ఉన్నవాటిని తీసివేస్తే… పరిశోధనలు ఎలా సాగుతాయి.

పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ మరోసారి పాలకులకు గట్టి షాక్ ఇచ్చింది. నాడు తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర పాలకులకు ముచ్చెమటలు పట్టించిన ఉస్మానియా యూనివర్శిటీ నేడు తెలంగాణ పాలకులకు సైతం అందే రీతిలో చుక్కలు చూపిస్తున్నది. తాజాగా ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ సర్కారుకు భారీ షాక్ ఇచ్చారు. ఆ వివరాలు కింద చదవండి.

తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటి వరకు కోర్టుల నుంచి సర్కారుకు షాక్ తగిలే పరిస్థితులు ఉండేవి. కానీ ఈసారి కోర్టు షాక్ కాదు.. సైన్స్ కాంగ్రెస్ రూపంలో ఉస్మానియా విద్యార్థులు ఇచ్చారు. వందేళ్ల సైన్స్ కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి ఈ తరహా షాక్ ను కేవలం తెలంగాణ సర్కారుకే తగిలిందంటే కారణం ఉస్మానియా విద్యార్థుల ఆక్రందనలే కారణంగా చెప్పవచ్చు.
Indian Science Congress

హైదరాబాద్ లోని ఉస్మానియాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు అనూహ్యంగా వాయిదా పడింది. ఉస్మానియా యూనివర్శిటీలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టేందుకు సర్కారు ఎప్పటినుంచో ఏర్పాట్లలో మునిగిపోయింది. ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 వేల మంది సైంటిస్టులు వస్తారని, వారందరికీ మంచి భోజనం అద్భుతమైన వసతి ఉండేలా చర్యలు తీసుకోవాలని సర్కారు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లలో మునిగిపోయింది. ఉస్మానియా విద్యార్థులకు నెలరోజులపాటు సెలవులు ఇచ్చి బయటకు పంపేందుకు కసరత్తు కూడా చేసింది. కొందరు విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా కూడా బలవంతంగా గెంటేస్తామని హెచ్చరించింది. అయితే ఈ సదస్సు వాయిదా వేస్తున్నట్లు సైన్స్ కాంగ్రెస్ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. ఉస్మానియాలో జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న సదస్సును వాయిదా వేస్తున్నట్లు సైన్స్ కాంగ్రెస్ తన వెబ్ సైట్ లో సమాచారం పోస్టు చేసింది.

యూనివర్శిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే సదస్సు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. యూనివర్శిటీలో తెలంగాణ సర్కారుపై విద్యార్థులు రగిలిపోతున్నారని, ఈ పరిస్థితుల్లో సదస్సు జరిగితే అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని సర్కారు భావించింది. అందుకే ఓయూ వైస్ ఛాన్సెలర్ చేత ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ సదస్సును నిర్వహించడం కష్టమని నివేదిక ఇప్పించిచారని తెలిపింది. ప్రధాని మోదీ కూడా ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, శాంతి భద్రతలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్టు సైన్స్ కాంగ్రెస్ వర్గాలను కలవరపాటుకు గురిచేసింది. దీంతో  సదస్సును వాయిదా వేశారు. 11 ఏళ్ల తర్వాత సైన్స్ కాంగ్రెస్ హైదాబాద్ లో జరగాల్సి ఉంది. గత వందేళ్లలో సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడటం ఇదే తొలిసారి. గత ఏడాది ఈ సదస్సు ఏపీలోని ఎస్వీ యూనివర్శిటీలో నిర్వహించారు.

ఇటీవలే మురళి అనే విద్యార్థి ఓయూలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో, అక్కడ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు, నాన్ టీచింగ్ స్టాఫ్ నిరవధిక దీక్షలు చేస్తున్నారు. ఇంకొకవైపు లంబాడాలు-ఆదివాసీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఉద్యోగ నోటిపికేషన్ల కోసం యువత పెద్ద ఎత్తున ఉస్మానియా కేంద్రంగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మార్పీఎస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతోంది. వీటికి సంబంధించిన విద్యార్థులు యూనివర్శిటీలో ఏ క్షణంలోనైనా ఆందోళన చేసే ప్రమాదముందని గుర్తించి వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో ఉద్యోగాల జాతర సాగి తామందిరికీ కొలువులొస్తాయని నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. దీంతో నిరుద్యోగులు గత మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉస్మానియాలో పోరాటాలు తీవ్రంగా ఉన్నాయి. గతంలో జరిగిన వందేళ్ల ఉస్మానియా వేడుకల్లో విద్యార్థులు ఆగ్రహావేశాలు ఎంతగా ఉన్నాయో సర్కారు స్వయంగా చవిచూసింది. దీంతో ఆ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడకుండానే వెనుదిరిగిన పరిస్థితి ఉంది. విద్యార్థుల వ్యతిరేకత కారణంగానే కేసిఆర్ మాట్లాడకుండా ఉస్మానియా నుంచి వెనుదిరిగినట్లు చెబుతున్నారు.  అప్పట్లో నిరుద్యోగుల్లో ఇంత ఆగ్రహం లేదు. కొందరికి సర్కారు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తుందేమోనన్న ఆశ ఉంది. అందుకే ఆ సమయంలో విద్యార్థుల ఆందోళనను సర్కారు కంట్రోల్ చేయగలిగింది. కానీ ఇప్పుడు విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి మరింత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందన్న భయంతోనే విసి చేతులెత్తేశారని తెలుస్తోంది. ఒకవేళ సదస్సు జరిగి తీరా విద్యార్థులు ఆందోళన చేస్తే… ప్రపంచం ముందు తెలంగాణ సర్కారు అవమానాలపాలవుతుందన్న అంచనాతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

మొత్తానికి ప్రపంచ తెలుగు మహాసభలు, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును విజయవతంగా చేపట్టి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న తెలంగాణ సర్కారుకు సైన్స్ కాంగ్రెస్ జరపలేకపోయారన్న అపవాదు మూటకట్టుకుంది. సైన్స్ కాంగ్రెస్ జరిగే వేళ ఏదైనా గొడవలు జరిగితే తెలంగాణ యూనివర్శిటీల్లో ఉన్న అశాంతి భారతదేశానికే కాకుండా సరిహద్దులు దాటుతుంది… అందుకే ఈ నిర్ణయం…

Categories
Jobs/TSPSC Sucides

సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగి ఆత్మహత్య

Unemployed suicide  sirisilla
Unemployed suicide sirisilla
Categories
Govt Failures Jobs/TSPSC

​త్వరలో 3000 పోస్టుల భర్తీ // నమస్తే తెలంగాణలో వార్త

👉రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణ వాటాకు వచ్చిన ఉద్యోగాలు (అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం): 5,23,675.

👉అప్పటికి రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు: 3,15,849.

👉ఈ మూడేళ్లలో రిటైరైన ఉద్యోగులు సుమారు: 46,000.

👉అంటే ప్రభుత్వ శాఖలలో  ఉన్న మొత్తం ఖాళీలు: 2,53,826

👉ఇవికాక, ఆర్టీసీ, సింగరేణి, ట్రాన్స్కో, జెన్కో వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న ఖాళీలు సుమారు: 50,000

👉మొత్తం కలిపితే మొత్తం ఖాళీలు సుమారు: 3,00,000 
👉ఈ మూడేళ్లలో భర్తీ చేసిన ఖాళీలు సుమారు 20,000.👉రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 21 జిల్లాలు, 125 మండలాలు, 25 రెవిన్యూ డివిజన్లు, అనేక గురుకులాలు… ఏర్పడ్డాయి. వీటికి అదనంగా సుమారు 20,000 అదనపు పోస్టులు అవసరం.

👉అంటే ఇంకా భర్తీ కానీ ఖాళీలు సుమారు 3,00,000 పైనే

👉ఇప్పుడు…మూడేళ్ళ తరువాత 3,000 పోస్టులకు నోటిఫికేషన్లు వేస్తారట…

👉అంటే మొత్తం ఖాళీలలో 1%…

👉అదికూడా “త్వరలో”…

మురిసిపోదామా?

Categories
Govt Failures Jobs/TSPSC News Victim Voice

OU లో MSc విద్యార్థి మురళి ఆత్మహత్య


ఓయూలో విద్యార్ధి ఆత్మహత్య కలకలం రేపింది. మానేరు హాస్టల్‌ సమీపంలో మురళి అనే ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్ధి ఆత్మహత్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మురళీ మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. విద్యార్ధి మృతదేహం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Watch video here

*ఓయూలో MSc physics 1st year విద్యార్థి మురళి ఆత్మహత్య.ఉద్యోగాల నోటిఫికేషన్లు రావటం లేదని మనస్తాపం తో మానేరు హాస్టల్ బాత్రూమ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మురళి*.

*సిద్దిపేట్ జిల్లా జైదేవ్ పూర్ మండలం దౌలాపూర్ గ్రామం,బిసి డి ముదిరాజ్ సామాజికవర్గం*

*సుసైడ్ నోట్ మాయం పోలీసుల పై విద్యార్థుల అనుమానం?*

*50లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించాకే మృతదేహాన్ని మానేరు హాస్టల్‌ నుండి పోస్టుమార్టమ్ తరలించాలని నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్ డిమాండ్*

*సిఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కి చెందిన ఓయూ విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకోవడం కెసిఆర్ ప్రభుత్వానికి సిగ్గుచేటు*

*సిఎం కెసిఆర్ కి మురళి ఆత్మహత్య తోనైనా కనివిప్పు కలగాలి*

*రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యల బాట పట్టకముందే ఖాళీగ ఉన్న 2లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఒకే సారి విడుదలచేయాలి. నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్*

విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికి వరకు సైలెంట్‌గా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి ఆత్మహత్యతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం మహబూబ్‌నగర్‌లో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న ‘కొలువుల కొట్లాల సభ’ నేపథ్యంలో విద్యార్థి ఆత్మహత్య సంచలనంగా మారింది.

Categories
Govt Failures Jobs/TSPSC News

బీఈడీ సర్టిఫికేట్ అమ్మకానికి పెట్టిన నిరుద్యోగి

ఇది నా బీఈడీ సర్టిఫికేట్.. అమ్ముతాను..ఎవరైనా కావాలంటే చెప్పండి ఇస్తా.. మీరిచ్చిన డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి donate చేస్తా …తెలంగాణ ప్రభుత్వం దీనితో నాకు ఏమి ఉపయోగం లేకుండా చేసింది..మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది..నేను బీఈడీ చదివే రోజుల్లో నాకు ఫీజు రీయింబర్స్ కూడా రాలేదు..మంచి ర్యాంక్ తో సొంత డబ్బులతో ఫీజు కట్టి చదువుకున్నా పంతులు ఉద్యోగం కొలువు చేద్దామని..మంచిగ పూర్తి చేసిన..ఇక పంతులు కొలువు ఎప్పుడెప్పుడు సాధిద్దామా అని ఎదురుచూసిన..అప్పుడు టెట్ అని ఇంకో మెలిక పెట్టిర్రు..దాంట్లో 60%మార్కులు రావలంట..సరే అదికూడా చదివిన 72% మార్కులు తెచ్చుకున్న..2012 dsc రాసిన 72 మార్కులు వచ్చినాయి..ఉద్యోగం రాలే..అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది..ఉమ్మడి Ap ప్రభుత్వం మరో Dsc నోటిఫికేషన్ కి సిద్ధపడింది..మా తెలంగాణ లో మేమేసుకుంటం అని ఉద్యమంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నం.. ఎప్పుడెప్పుడు dsc నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూసినం…మూడేళ్లకు కానీ మన ప్రభుత్వానికి మూడు రాకపాయే..సరే ఇప్పుడు వచ్చింది.మన ప్రభుత్వంలో పంతులు కొలువుకోసం చదువుతున్న. కానీ మన ప్రభుత్వం డిగ్రీ లో 50% మార్కులు ఉంటేనే exam రాయాలని మెలిక పెట్టింది. నేనెప్పుడో 2008 లో డిగ్రీ పూర్తి చేసిన..నాకు 48.25% మార్కులు వచ్చాయి..అప్పుడే బీఈడీ కి అర్హత లేదంటే వేరేది చదువుకొనే వాడిని.. బీఈడీ చేసి 2 సార్లు టెట్ రాసి, ఒకసారి dsc రాస్తే…ఇప్పుడు నేను అర్హుడిని కాదంట.. ఇదెంత వరకు న్యాయమో మీరే చెప్పండి..36% మార్కులు వచ్చిన వాడు కలెక్టర్ అవ్వచ్చు..గ్రూప్ 1 & 2 ఎంప్లాయీస్ అవ్వచ్చు.. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నాకు అర్హత లేదంటారా.మరి పక్కనున్న Ap dsc lo అందరికీ అవకాశం ఇచ్చింది.. నాకు PG లో 75% మార్కులున్నయి..నేను అర్హుడుని కాదా..కనీసం ప్రైవేట్ టీచర్ గా కూడా పనికిరానని మన ప్రభుత్వం certifie చేసింది నన్ను…అలాంటప్పుడు ఎందుకు నాకీ మెమో.. ప్లీజ్ ఎవరైనా కొనండి నా మెమో..నా మీద జాలి తో అయిన…ఆ డబ్బు కచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తా…నేను ఇప్పటికీ రెండు PG లు చేసా…ఆ మెమోలు కావాలన్న ఇస్తా…ఎవ్వరూ కొనకపోతే కోదండరాం సార్ సమక్షంలో యూనివర్సిటీ వారికి రిటర్న్ చేస్తా…నేను ఎవ్వరి మీద కోపంతో ఈ మాటలు చెప్పట్లేదు…ఒక నిరుద్యోగిగా…నా బాధ చెప్పుకున్నా…

Categories
Govt Failures Jobs/TSPSC

TSPSC శల్య సారధ్యం

లక్ష ఉద్యోగాల కాంక్షతో పోరాడిన ఉద్యమం,తెచ్చుకున్న రాష్ట్రం..ఏర్పాటు చేసుకున్న కమీషన్..దానికి అత్యంత ప్రతిభావంతుడు, ఉద్యమకారుడు ఛైర్మెన్..అంతే ఉద్దండపిండాలైన సభ్యులు.మరి అటువంటప్పుడు ఆ సర్వీస్ కమీషన్ పనితీరు ఏ రేంజ్ లో ఉంటుంది..ఇవన్నీ చెపుతుంది టీఎస్పీఎస్సి గురించే.పేపర్ మీద పులులు అని ఒకప్పుడు భారత క్రికెట్ టీమ్ ను అనేది.ఇప్పుడు ఆ వ్యాఖ్య టీఎస్పీఎస్సి కి అచ్చుగుద్దినట్టు సరిపోయితుంది.ప్రభుత్వం ఒక వైపు నియామకాలకు అనుమతులు ఇస్తున్నా,సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది మొదలు వివాదాలు చుట్టుముడుతున్నాయి.లోపాలు ఒక్కసారి జరిగితే ఒకే కానీ ప్రతీ నోటిఫికేషన్ మీద వివాదాలు రావడానికి అసలు కారణాలు ఏంది??సభ్యులకు ఛైర్మెన్ కు మధ్య మనస్పర్థల?లేక కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమం లోలోపల జరుగుతోందా??నీళ్లు,నిధుల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన కేసీఆర్ టీమ్ అసలు సిసలు మాటైన లక్ష ఉద్యోగాల విషయంలో ఇంకా ఎందుకు తడబడుతున్నది??వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మీద తీవ్ర ప్రభావం చూపే కొలువుల విషయంలో అసలు టీఎస్పీఎస్సి ఇంకా మొద్దు నిద్ర ఎందుకు వీడడం లేదు.అన్ని నాకే తెలుసు అనే ఛైర్మెన్ బిరుసుతనమా?లేకా సభ్యులు,ఛైర్మన్ మధ్య సమన్వయ లోపమా??ఒకప్పుడు ఏపీపీఎస్సి మీద ఉండే ఉక్రోషం కంటే ఎక్కువ ఇప్పుడు టీఎస్పీఎస్సి మీద ఉంది.సర్వీస్ కమీషన్లు అన్నీ ఇంతే అనే స్థాయికి దిగజారిపోయింది టీఎస్పీఎస్సి..

టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన టీఆర్టీ నోటిఫికేషన్ వివాదాస్పదమవుతోంది. ఇప్పటివరకు నోటిఫికేషన్లు పాత జిల్లాల ప్రకారం విడుదల చేసి.. టీచర్‌ పోస్టులు కొత్త జిల్లాల ప్రకారం ప్రకటించడం ఎంతవరకు సమంజసమని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇవ్వడం అభ్యర్థులకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. జిల్లాల పెంపుతో స్థానికతకు ఏమాత్రం భంగం వాటిల్లదని వాదిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చెబుతోంది. అయితే కొత్త జిల్లాల వారీగా పోస్టులు ప్రకటించడం..కొన్ని జిల్లాలకు పోస్టులు కేటాయించకపోవడం అక్కడి అభ్యర్థులను తీవ్రమనోవేదనకు గురిచేస్తోంది. అయితే స్థానికేతరులకు 20శాతం అవకాశం ఉండటం వల్ల కొంతమేర ప్రయోజనం ఉంటుందని విద్యార్థి, యువజన సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

గ్రూప్‌2 పరీక్షల్లో వైటెనర్‌ విషయంలో తెలివితక్కువగా వ్యవహరించిందన్న ఆరోపణలున్న టీఎస్పీఎస్సీ, ఇటు గ్రూప్‌1 ఫలితాల వెల్లడిలోనూ ఏకంగా టాప్‌ ర్యాంకర్‌ల పోస్టింగ్‌లనే సరిచూసుకోలేక పోయిందంటే కమిషన్‌ ఆదినుంచీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందంటున్నారు విద్యార్థులు. అయితే, ఇప్పుడు కమిషన్‌ నెపాన్ని సీజీజీ పైకి నెడుతోంది. నిజానికి కమిషన్‌కు సమర్ధులైన సభ్యులను నియమించినప్పటికీ లోపాలు జరుగుతుండడం గమనార్హం. పైగా టీఎస్పీఎస్సీ కూడా అక్రమాలు అవకతవకల కమిషన్ అన్న ముద్ర వేసుకుంటోందనే ఆందోళన అప్పుడే మొదలైంది. ఇన్నేళ్లలో సక్సెస్‌ఫుల్ గా నిర్వహించిన పరీక్ష గాని ఫలితాలు గాని లేకపోవడాన్ని అభ్యర్థులు తప్పుబడుతున్నారు. ఇదే తీరు కొనసాగితే ఉమ్మడి రాష్ట్రంలో ఏపిపిఎస్‌సికి పట్టిన గతే టీఎస్పీఎస్సీకీ పడుతుందని అభ్యర్ధులు హెచ్చరిస్తున్నారు. అటు ప్రభుత్వంలోని పెద్దలు కూడా పైకి కమిషన్‌ను మెచ్చుకుంటున్నా.. అంతర్గతంగా, వారి పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Categories
Mallanna Sagar Victim Voice

Bathukamma Song Against CM KCR and Mallanna Sagar

Erravelli Women Emotional Bathukamma Song Against Mallanna Sagar Project and CM KCR.