Categories
Govt Failures News Public Voice

ఓ వైపు గులాబీ పురుగుల దొరల పోటు, మరోవైపు దోమ పోటు

ఓ వైపు గులాబీ పురుగుల దొరల పోటు, మరోవైపు దోమ పోటుతో దగాపడి, పండించిన పంటకు మంట పెడుతున్న రైతన్నలు.
మేము పండించే పంటలకు మద్దతు ధర కల్పించండి, ఆరుగాలం శ్రమించి ఆత్మగౌరవంతో బ్రతుకుతాం.
మా కష్టానికి విలువ ఇవ్వకుండా మీరు వేసే బిచ్చానికి అలవాటు చేసి మమ్మల్ని మీలా లచ్చగాళ్లను చేయకండి
దొరా.. నువ్వు ఇవ్వాలనుకునే 4 వేలతో నీలాగ పట్నంలో లో పండుకొని ఫామ్ హౌస్ లో పార్టీలు చేసుకునే వాళ్ళకే ఉపయోగం.

Categories
Govt Failures News

వడ్డీ పైసల కోసం కేసీఆర్ దగ్గరకు పోవాలి అంటున్న రైతులు

Categories
Govt Failures News Public Voice

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కండక్టర్ సస్పెండ్.

సమైఖ్య రాష్ట్రంల సుత ఇంతగనం ఒత్తిడి లేదురా అయ్యా.. పోరాటం చేశిర్రు, తిట్టిర్రు, పెన్ డౌన్ చేశిర్రు, ధర్నాలు చేశిర్రు అయినా ఉద్యోగాల జోలికి రాలే.. ఇప్పుడు వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట.. సారుకు నిజాం అంటే ఎంత గౌరవమో ఎప్పటికప్పుడు నిరూపిస్తుండు.

Categories
Govt Failures News Public Voice

ఉద్యోగం రాదని మనస్తాపానికి గురైన సిడం మహేందర్ P.G,B.Ed(social) ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

ఆదిలాబాద్ జిల్లాలో నూతన జిల్లాల DSC వల్ల ఉద్యోగం రాదని మనస్తాపానికి గురైన సిడం మహేందర్ P.G,B.Ed(social) ఆత్మహత్య కు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే మహేందర్ నిరుపేద విద్యార్థి DSC కోసం 4 సం. లుగా ప్రిపేర్ అవుతున్నాడు. DSC పై త్వరలో ప్రకటన వెలువడుతుందని హైదరాబాద్ లో ఆర్థిక భారం ఉన్నా అప్పుచేసి రెండుసార్లు కోచింగ్ తీసుకున్నాడు..ఉమ్మడి ఆదిలాబాద్ లో సోషల్ సబ్జెక్ట్ లో ఖాళీలు 40 వరకు ఉండేవి కొత్త జిల్లా ప్రకారం 3 ఉన్నాయి. కొత్త జిల్లా DSC ఉంటదని ప్రకటన చేయడం తో ఉద్యోగం రాదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.BJP జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు వారి కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేశారు. నిరుద్యోగ సోదరులారా దయచేసి ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడకండి.పోరాడి సాధించుకుందాం. మహేందర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.

Categories
Govt Failures News

పాత జిల్లాల ప్రకారం DSC వేయాలని నిరుద్యోగుల డిమాండ్

Categories
Govt Failures

మార్కెట్లో రైతుని దోసుకుంటున్న సర్’కార్’ రక్త పింజరాలు

ఈ యేడు అధిక వర్షపాతం వల్ల చాలా చోట్ల పత్తి, వరి దెబ్బతిన్నాయి. ఒచ్చిన దిగుబడి కైనా కనీస మద్దతు ధర(MSP) వస్తే కొంచమైనా రైతులకు తేలికయ్యేది. కని ఇప్పటికి పత్తి మార్కెట్లలో CCI కేంద్రాలు తెరచుకోలేదు, తెరచుకున్నా కొన్ని మార్కెట్లలో కూడా తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణం తో CCI కొనకపోవడం వల్ల అక్కడే రాబందులలెక్క కాసుక్కుసున్న దళారులు చాలా తక్కువ ధరకు కొని రైతుని నట్టేట ముంచుతుర్రు.

TRS Govt cheating former's on MSP
TRS Govt cheating former’s on MSP

అసెంబ్లీ సెషన్స్ లో ఎవరైనా(ప్రతిపక్షం, అధికార పక్షం) ఈ సమస్యని తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారేమో అనుకుంటే అస్సలు ఈ విషయాన్నే లెవనెత్తుతలేరు. ఎందుకంటే ఆ దళారుల పాపంలో అధికార, ప్రతిపక్షాలు భాగమైనందుకేనేమో అనే అనుమానంలో నిజం లేకపోలేదు.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రేస్ కొంచమైనా రైతుల సమస్యలను గట్టిగా అసెంబ్లీలో లెవనెత్తితే బాగుండు కాని వాళ్ళు మల్లన్నసాగర్ రైతులమీద లాఠీచార్జి జరిగినా, ఖమ్మం మార్కెట్లో మిర్చి రైతులకు బేడిలేసిన ఒక్కపారైన సప్పుడు చెయ్యలేదు.ఇప్పుడు సప్పుడు చేస్తారనే నమ్మకం లేదు, అప్పుడే పంట నష్టంతో రైతు ఆత్మహత్యలు మొదలవ్వడం విచారకరం.

మార్కెట్లో దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి మద్దతు ధర వచ్చేలా చెయ్యకుండా ఎకరానికి 4 వేలు పెట్టుబడి ఇస్తే రైతులకు అన్నీ అయిపోతాయి అనుకోవడం మూర్ఖత్వమే అనుకోవచ్చు.

Categories
Govt Failures News

కెసిఆర్ తిట్లకు కోదండరాం సర్ సమాధానాలు

Categories
Govt Failures News

కెసిఆర్ ప్రభుత్వం కొలువులు ఎందుకు ఇస్తలేదో చెప్పిన కోదండరాం సర్

జోనల్ వ్యవస్థ లాంటి కీలక నిర్ణయాలలో ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య పూరిత వైఖరి కారణంగానే నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది …”కొలువుల కొట్లాట” దెబ్బకు మత్తు వదలి ప్రభుత్వం మళ్లీ జోనల్ వ్యవస్థపై ఆలోచించడం మొదలు పెట్టింది…వత్తిడి లేకుంటే మళ్లీ మత్తులోకి జారుకుంటుందీ ప్రభుత్వం… యువత సంఘటితంగా పోరాడి మన కొలువులు మనం సాధించుకుందాం…అంటున్న టీజేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం

Categories
Govt Failures Nerella incident Victim Voice

దమన కాండపై కంట తడి పెట్టిన నేరెళ్ల దళిత కుటుంబాలు