Categories
KCR Flip-Flops News

కేసీఆర్ కాళ్ల బేరం కోసం వీస్తున్న పవనాలు జ్ఞానం లేని “అజ్ఞాతవాసి” కోసమేనా ?

విషయ పరిజ్ఞానం లేని పవన్ కల్యాణ్ లాగానే అభిమానులం అని చెప్పుక తిరిగే వాళ్ళు అయినా విషయం పైన పరిజ్ఞానం, జ్ఞాన సముపార్జన పెంచుకోండి, పవన్ కల్యాణ్ గారికి చెప్పండి.
వ్యక్తిగతంగా పవన్ సినిమాలు అంటే మాకు ఇష్టమే కేసీఆర్ లా వాడెవడో నాకు తెల్వదు, ఒక్క చిటికేస్తే గింతంత పవన్ కళ్యాణ్ 1000 ముక్కలు ఆయుతాడు అని మేము అనడం లేదు.
ఇక్కడ ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి పేపర్ లలో ఆడ్స్ వేసింది చూసి ఎలా ఇస్తున్నారో తెలుసుకుందాం అని ప్రగతి భవన్ కి వచ్చి, ఇది TRS గనతే అని పవన్ KCR కి వత్తాసు పలకడం చూస్తుంటే పూర్తిగా విషయ పరిజ్ఞానం లేని అజ్ఞాని లా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు.

KCR Pawan

పేపర్ లలో ఉద్యోగాలు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర లేక రైతుల ఆత్మహత్యలు, దళితులపై దాడులు పవన్ కి కనిపించడం లేదా…… ?
వీటిపైన కేసీఆర్ ని ఎందుకు నిలదీయ లేదు….?
పోనీ కనీసం బాధితులను అయినా కలిశాడా….?

ఇక తెలంగాణాలో పవర్  విషయానికి వస్తే గత 3 సంవత్సరాలుగా ఎన్ని పవర్ ప్లాంట్స్ TRS హయాంలో నిర్మించారు, కేసీఆర్ ఎప్పుడు చెప్పే భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్స్ నిర్మాణం పూర్తి అయిందా….?
ఇప్పుడు ఒక్క తెలంగాణ నే కాదు దేశం మొత్తం 24 గంటల విద్యుత్తు దిశగా అడుగులు వేస్తుంది, చాలా రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్తు ఇస్తున్నారు. ఇదంతా గత ప్రభుత్వాల కృషి, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పట్టుదల. తెలంగాణ ప్రభుత్వం కొన్ని పవర్ కంపెనీల నుండి కమిషన్ లకు కక్కుర్తిపడి అధిక ధరలకు కొంటుంది అని ప్రతిపక్షాల ఆరోపణలు కూడా ఉన్నాయి.
తెలంగాణ జేఏసీ పవర్ గూర్చి ఏం చెబుతుందో చూద్దాం. ఈ క్రింది ఆర్టికల్స్ చదువండి.

వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్తు ప్రచారాలు – వాస్తవాలు

నిరంతర విద్యుత్తు-ప్రచారాలు – వాస్తవాలు

ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ మీటింగ్ ఏదో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో జరిగిందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది కత్తి మహేష్ చెప్పినట్టు అజ్ఞాత వాసి సినిమా టిక్కెట్లు అమ్ముకొనికేనా…..?

కెసిఆర్ తాట తీస్తా అన్నోడు అజ్ఞాతవాసి సినిమా కోసం మరీ ఇంత కాళ్ళ బేరానికి పోతాడా పవన్…?
తెలంగాణ సబ్బండ వర్ణాల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా లో కల్వకుంట్ల అయ్యా కొడుకులు చేస్తున్న కుట్రలను బట్టలిప్పి చూపించాడు. ఆ సినిమా లో చూపించి నట్టే ఇప్పుడు ఉద్యమాన్ని అయ్యకొడుకులు తమ స్వార్థం కోసం వాడుకుతున్నారు.
మరి ఇప్పుడు పవన్ దేని కోసం కేసీఆర్ అసత్యాలకు వత్తాసు పలుకుతుండు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్టు కేసీఆర్ ఉచ్చులో పడి పవన్ రాజకీయంగా బలియైనడా…..?

తెలంగాణ వస్తే 11 రోజులు ఉపవాసం ఉన్న పవన్ కళ్యాణ్ ను ఓటు బ్యాంకు(సెటిలర్స్) రాజకీయల కోసం కెసిఆర్ వాడుకుంటుండా ?

కేసీఆర్ చేసిన సర్వే ప్రకారం కొన్ని నియోజకవర్గాలలో 10 వేల లోపు ఓట్లతో TRS ఓడిపోయే దగ్గర పవన్ కళ్యాణ్ మద్దతు ఉంటే గెలిచే అవకాశం ఉంటదని పవన్ మద్దతు కోరుతున్నాడని మరికొంత మంది వాదన. 

ఇంకా కొంతమంది పార్టీ ఆఫీస్ కోసం స్థలం కేటాయించుకోవడం కోసం కూడా అయిఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Categories
KCR Flip-Flops

Nizam Sarkar = (K)ha(C)im(R)azvi Sarkar

☪నిజాం ప్రభువు చాల గొప్పవాడు….ఎందుకంటే?
☪మన ఆడవాళ్ళును నగ్నంగా బతుకమ్మ లాడించినందుకు.
☪మన ఆడవారి ఆరు టన్నుల పుస్తెలు(మంగళసూత్రాలు) తన ఖజానాలో జమ చేసినందుకు.
☪పంటలు పండిన,పండకపోయిన హింసించి అయినా పన్ను వసూలు చేసినందుకు.
☪కొందరినైన హిందువులను మతం మార్చినందుకు.
☪చదివితే ఉర్దూలోనే చదవాలని ఉర్దూ పాఠశాలలు పెట్టినందుకు.
☪ప్రజాధనంతో రామాలయం కట్టిస్తే, రామదాసును జైలులో పెట్టి నానహింసలు పెట్టినందుకు.
☪నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ పోరాటం చేసిన ప్రజలను చంపించినందుకు.
☪రజాకార్లు ఊళ్ళమీద పడి బీభత్సం సృస్టిస్తూ ప్రజల మాన,ప్రాణాలు తీస్తూ దోపిడీలు చేసినందుకు.
☪హిందువులు 95% ఉండికూడ నిర్భయంగా స్వేచ్ఛా వాయువు పీల్చలేని పాలనలో జీవించినందుకు.
☪రాజ్యంలోని భూమిని తన తొత్తులైన జమీందారులకు,దేశ్ ముఖ్ లకు ఇచ్చి, వాళ్లు ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకున్నందుకు.
☪స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ సంస్థానాన్ని భారత్‌లో కాకుండా పాకిస్తాన్ లో విలీనం చేస్తా అన్నందుకు.
☪మా సంస్థానాన్ని విలీనం చేయమని వత్తిడితెస్తే ఇక్కడ ఉన్న హిందువుల భార్య బిడ్డలను చంపివేస్తామని కాసిం రజ్వీతో డిల్లీ పెద్దలను బెదిరించినందుకు.
☪ప్రజలు నెత్తుర్ని చెమటగ మార్చి పన్నులు కట్టిన ఆదాయంతో తన ఉంపుడుగత్తెలకు కూడా మిద్దెలు,భవనాలు కట్టుకొని కులుకుతూ విలాసవంతమైన జీవితం గడిపినందుకు.
☪ జమీందారు, మరియు దొరలు వయస్సులో ఉన్న, తమకు నచ్చిన,కొత్తగా పెళ్ళయిన ఆడవారిని రాత్రికి తన పక్కలోకి పంపు, లేకపోతే ప్రాణాలు గాలిలో కలిసిపోయని బెదిరించినపుడు , ఆ దుస్థితిలో ఏమిచేయాలి,ఎవరితో చెప్పాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఆర్ధనాదలు,రోదనల నడుమ కాలంగడిపిన పాలన ప్రజలకు
అందించినందుకు.

🙊కె సి ఆర్ సారుకూడ చాల గొప్పవాడు….ఎంత అంటే?
🙊అబద్దాలంటే అసలు తెలియవు, సాక్షాత్తు సత్యహరిచంద్రుని మనుమడు.
🙊ఉద్యమకాలంలో బంగారు తెలంగాణ అనే స్వర్గాని అరచేతిలో చూపించినందుకు.
🙊లక్ష కుటుంబాలలో ఒకొక్క ఉద్యోగం ఇచ్చి తమ కుటుంబంలో ఒక్క ఉద్యోగం కూడా తీసుకోనందుకు.
🙊ఓడదాటెదాక కోదండ రాముడు బంగారం, దాటినాక తాడుబొంగరం లేని రామ్,అని అన్నందుకు.
🙊నిరుపేదలకు డబుల్ చెప్పి, లక్షల్లో త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ ఇచ్చినందుకు.
🙊 కె జి టు పి జి ఉచిత విద్యనిచ్చినందుకు.
🙊విద్యార్థులను విస్మరించకుండా వాళ్ళకు తగిన గౌరవం ఇచ్చినందుకు.
🙊ప్రపంచంలో ఉన్న ముఖ్య పట్టణాలను మన రాష్ట్రానికి తెచ్చినందుకు.

ఎంతని చెప్పాలి,ఏమని చెప్పాలి వీరి గొప్పతనం,
రాస్తే చాట భారతం,చూస్తే అగాధం, ఒకరుమించింనవారు,మరొకరు
ఏడవ నిజాం ప్రభువు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న వాడు మన ఎనిమిదవ కెసిఆర్ ప్రభువు.
నిజాం పాలనను మురిపిస్తూ మరిపిస్తానంటున్న ఆదునిక తెలంగాణ ప్రాంత అభినవ పిచ్చి తుగ్లక్ కెసిఆర్ సారు పాలన.

Categories
KCR Flip-Flops News

తెల్శినోనికి తెల్కపిండి తెల్వనోనికి గానుగపిండి అన్నట్టుంటయి మన కేసీఆర్ ముచ్చట్లు

మా ఊళ్లే ఓ తాతకు కోళ్లఫారం ఉంది. ప్రతి దసరా పండక్కి ఓ కోళ్ల బ్యాచ్ ఒచ్చేటట్లు కోడిపిల్లల్ని ఏసేటోడు. ఊరంతా దసరా పండగ రోజు గాన్నే కోళ్లు కొనుక్కునేటోళ్లు. ఓ ఏడు తాత గ్యాసారం బాగాలేక దసరా పండగ 2 రోజుల ముందు గట్టిగా వాన పడి కోళ్లఫారం సగం కూలిపోయింది. దానివల్ల సగం కోళ్లు సచ్చిపోయినై. దసరా నాడు కోళ్లు కొందామని పోతే నూరుకు అమ్మాల్సిన కోడి ₹200 అన్నాడు. గదేంది తాత ₹100 నే కదా ₹200 అమ్ముతున్నావంటే ప్రతి దసరాకి 1000 కోళ్ల దాకా అమ్మేటోన్ని కని నా దగ్గర 500 ఉన్నాయి అందుకే ఇప్పుడు ₹200 ఒకటి అమ్ముతున్నా అన్నాడు. ఎం చేస్తాం ముసలోనికి నష్టం వచ్చింది, గట్లే గిరాకీ కూడా పెరిగిందని ఆయన చెప్పిన ధరకి కోళ్లను కొనక్కపోయారు ఊరంతా….

ఇప్పుడు గదంతా ఎందుకు చెప్తున్నా అనే కదా మీ సందేహం. గదే చెప్తున్నా

అమెరికాల హర్రీకెన్లు 2-3 సార్లోచ్చి పత్తి అధికంగా పండే ప్రాంతాలన్నీ నీళ్ల కొట్టుకపోయినై. మనదగ్గర కూడా అదేదో #అడ్డమైన #గులాభిరంగు_పురుగు సోకి, కల్తీ విత్తనాల వల్ల దిగుబడి చాలా తగ్గిపోయింది. గిసొంటి సమయం ల పత్తి ధర అంతర్జాతీయ మార్కెట్లో పెరగాలి కదా.మార్కెట్లో కావాల్సినంత లేకపోతే ఆటోమేటిక్ గా ధరలు పెరుగుతాయి. అది కొన్ని 100ల ఏండ్లనుండి జరుగుతున్న వాస్తవం.

కానీ మన ముఖ్యమంత్రి సారేమో అమెరికాల హర్రీకెన్లు ఒచ్చినయ్ కాబట్టి మనదగ్గర పత్తికి మద్దతు ధర లేదు అంటాడు ..

ఏందో ఈ మహానుభావుల మాటలు ఎవ్వరికీ అర్థం కావు😂😂😂

దొర, పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్ కి ₹4320, ప్రభుత్వం ఇంకా 50% కల్పి మొత్తం క్వింటాకి ₹6500 ఇస్తామని చెప్పారు. కని మన #గులాభి మార్కెట్ కమిటీ చైర్మన్లు అటు అధికారులు, ఇటు దళారులతో కుమ్మక్కై క్వింటాకీ ₹1500-₹4000 కంటే ఎక్కువ ఇస్తలేరు. ఈ ఘోరాలను తట్టుకోలేక, కడుపు మండి మార్కెట్ యార్డ్ లో జరంత లొల్లి చేస్తే వాళ్ళ ఆవేదనని సాటి రైతుగా అర్థం చెస్కోని దళారుల ఆగడాలు అరిక్కట్టాల్సింది పోయి పోయినేడు సిగ్గులేకుండా బేడిలేసి ఆ రైతుల మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని బెదిరింపులకు దిగితిరి. ఏ మార్కెట్లో చూడు అదే గొడవ.ఇయ్యాల కూడా గద్వాల్ మార్కెట్లో అందరూ కుమ్మక్కై పల్లి రైతులకు సగం ధర కూడా ఇవ్వకుంటే వాళ్ళు మార్కెట్ యార్డ్ మీద దాడి చేసిర్రు.నీకు అలవాటే కదా వాళ్ళమీద కూడా ఏదో దేశద్రోహం కేసువెట్టి లోపల నూకు. రైతు మార్కెట్లో ఉన్నప్పుడు మార్కెట్ కష్టాలు పట్టించుకోక 24 గంటలు కరెంటు ఇస్తున్నాం మాది రైతు ప్రభుత్వం అని అన్నీ బజార్లో వదిలేసి చెప్పవడ్తిరి…

గతంలో ఇంత బాధ్యతారాహిత్యాన్ని ఏ ప్రభుత్వం లో చూళ్ళేదు😣😣😣😐😐😐

అమెరికా లో హర్రీకెన్లు అక్కడి పంటకు నష్టం కలిగించడం వల్ల అంతర్జాతీయ పత్తి వ్యాపారులు భారతదేశం వైపు చూస్తున్నారని #REUTERS అనే సంస్థ రాసిన కథనం మీ కోసం.

Categories
KCR Flip-Flops News

కోదండరాం సార్ పైన సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

కోదండరాం అనేవాడు TRS పట్ల విషపురితమైన వ్యక్తి వాడు చేసింది అమరుల యాత్రనా.? లంగా యాత్రనా? జీవితంలో సర్పంచ్ గా గెలిచిండా ? నేను తయారు చేసిన లక్షల మందిలో వాడొకడు. ఉద్యమంలో వీడు చేసింది ఏమీ లేదు తొక్క TRS అధికారంలోకి రావడం వీడికి ఇష్టం లేదు.

Categories
KCR Flip-Flops News Public Voice Songs

కేసీఆర్ మోసం మీద జూనియర్ డాక్టర్ల పేరడీ పాట

కేసీఆర్ సారు, ఆరోగ్యశాఖలో ఇప్పటి దాకా ఎంత మందిని పెర్మెంట్ చేసినవు, కొత్తగా నియమించే వాళ్ళను మళ్ళీ గదే ఔట్సోర్సింగ్ పద్దతిని నియమించవడితిరి. 
మాటలకు చేతలకు ఏమన్న పొంతన ఉందా…..?
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అయినా చెల్లించొచ్చు కదా మహాశయా…..?
ఈ పాట వినుర్రి ఓసారి
తెలంగాణ అడబిడ్డలు మీ చేష్టలతో ఎలా విసిగిపోయారో

Categories
KCR Flip-Flops

లక్షా 13 వేల ఆంధ్రోళ్ల భూములు గుంజుకుంటాం అంటున్న కేసీఆర్

వైస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, చంద్రబాబు బంధువులు, నాగార్జున, రామోజీ ఇంకా ఆంధ్రోళ్లు అక్రమంగా కబ్జా పెట్టిన లక్షా 14 వేల ఎకరాల భూములు ఎప్పుడు ముక్కుపిండి వసూల్ చేస్తావ్ కేసీఆర్…..?

Categories
KCR Flip-Flops

తెలంగాణ వాదులారా ఇకనైనా మేల్కొందాం

దళితుడు మొదటి ముఖ్యమంత్రి
అంటే “నమ్మినం”.
ఉప ముఖ్యమంత్రి ని చేస్తే
“సర్దుకున్నాం”.
చెప్పకుండా రాజయ్య ను దించితే
“ఓర్చుకున్నాం”.

లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలిం సిటీ ని
దున్నుతా అంటే “నమ్మినం”.
సాక్ష్యాలు ఏమీ లేవు కదా అంటే
“సర్దుకున్నాం”

అక్రమ కట్టడాలు కూల్చివేస్త అంటే
“నమ్మినం”
అన్నమయ్య రామన్న మిత్రులే కదా
అని “సర్దుకున్నాం”

ఆంధ్ర మీడియా ను బొందపెడుతా అంటే
“నమ్మినం”
బొంద ఎందుకు అని నయీం డైరీకి
గోరీ కడితే “సర్దుకున్నాం”

అవినీతి జరిగితే కొడుకుని గూడ వదలను అంటే “నమ్మినం”
మియాపూర్ స్కాం లో బిడ్డ లేదు కదా అని “సర్దుకున్నాం”

తెలంగాణ తెచ్చుకున్నది కడుక్కుని తాగటానికి కాదు అంటే “నమ్మినం”
విలాస భవనాలు, వాస్తు, యాగాలు
విశ్వనగరం కొరకే అని “సర్దుకున్నాం”

రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అంటే
“నమ్మినం”
మల్లన్నసాగర్ లో అందరూ రాజు లే అని “సర్దుకున్నాం”

కోదండరాం సార్ ఎంత ముద్దుగున్నడూ
అంటే “నమ్మినం”
రామోజీ కి ఉన్న విజన్ లేక కాళ్ళ కు అడ్డుపడుతుండు అని “సర్దుకున్నాం”

కానీ

ప్రజల గొంతుక అయి మాట్లాడుచున్న
కోదండరాం సార్ ను పదేపదే అరెస్టు ల పేరుతో అగౌరవ పరిస్తే “ఊరుకోం”

నాయిని నర్సింహారెడ్డి ని టీవీ చానల్ చర్చ లో కొట్టిన పట్నం మహేందర్ రెడ్డి,

ఖమ్మం లో తెలంగాణ వాదాన్ని లేకుండా చేసిన తుమ్మల నాగేశ్వరరావు,

హైదరాబాద్ లో కేసీఆర్ ను అడుగు పెట్టకుండా చూస్తానని చెప్పిన
తలసాని శ్రీనివాస యాదవ్,

ఉప ఎన్నికలో తెలంగాణ వాదం లేదని చెప్పేందుకు ఎన్నికల బరిలోకి దిగిన
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,

వీళ్ళంతా రాష్ట్రం వచ్చిన తరువాత మంత్రులు అయ్యారు.

తెలంగాణ వాదులపై రాళ్ళ వర్షం కురిపించిన కొండా సురేఖ,

న్యాయవాదులను ఫుట్ బాల్ ఆడిన
తీగల కృష్ణారెడ్డి,

మెదక్ లో విద్యార్థులను చితకబాదిన
మైనంపల్లి హన్మంతరావు,

నిజామాబాద్ లో జగన్ వాదం వినిపించిన బాజిరెడ్డి గోవర్ధన్,

వీరంతా శాసనసభ్యులూ ఆయ్యారు.

డి.శ్రీనివాస్ ఉప ఎన్నికలలో ఓడిపోతే తను బలిదానం అవుతానని ఇషాంత్ రెడ్డి డి.శ్రీనివాస్ ఓడిపోగానే బలయ్యారు
డి.శ్రీనివాస్ మాత్రం రాజ్యసభ సభ్యులయ్యారు.

వీరంతా కరుడుగట్టిన తెలంగాణ వాదులు ఆయ్యారు.

ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో క్రియాశీలక భూమిక పోషించి
“సకల జనుల” అందరితో సమ్మె చేయించి హుస్సేన్ సాగర్ తీరాన తెలంగాణ ప్రజలతో “మిలియన్ మార్చ్”
చేయించి తెలంగాణ ఆకాంక్ష ను ఢిల్లీ కి పంపించిన కోదండరాం సార్ అవకాశవాది అయ్యారా….?

నచ్చితే నజరానా….
లేకుంటే జరిమానా నా…..?
ఎంతైనా
ఓడలో ఉన్నంత సేపు ఓడ మల్లన్న
లేదంటే బోడ మల్లన్న
ఇదీ మీ నైజం

తెలంగాణ వాదులారా ఇకనైనా మేల్కొందాం.