Categories
Public Voice

KCR పాలన ఒక పిట్ట కథ లో 

ఔరంగజేబ్ వారసుల్లో జహందర్ షా అని ఒకడుండే వాడు…

ఒక సం”రం పాటు అధికారం కూడా వెలగబెట్టాడులెండి..

ఏక్ నంబర్ తాగుబోతు,తిరుగుబోతు…

వాడికి అధికారం దక్కేటప్పటకి లాల్ కున్వర్ అని ఓ లపాకీ ఉండేది…

ఓ రోజు లాల్ ఖిల్లా మీద ఇద్దరూ నిలబడి ఉండగా దూరంగా యమునా నదిలో ఎనభైమందితో వెళ్ళే పడవ ఒకటి లపాకీ లాల్ కున్వర్ కంటబడింది..

అది చూసి సుల్తాన్ తో ఇలా అంది

“సుల్తాన్ సాహెబ్ నా కళ్ళతో ఎన్నో అద్భుతాలను చూసాను కానీ నదిలో వెళ్ళే పడవ మునగడం అందులో జనాల హహకారాలు చూడలేదండీ” అంది.

“ఓహో!! మై డియర్ లపాకీ లాల్ కున్వర్ అదేమంత భాగ్యం.. ఇప్పుడే చూపిస్తా ఉండు” అని చెప్పి వెంటనే భటులను పురమాయించి పడవను ముంచేయించాడు..

పడవలో ఉన్న డెబ్భైయ్యొక్క మంది తనువు చాలించగా తొమ్మిదిమంది బ్రతుకుజీవుడా!! అంటూ బయటపడ్డారు..

సాని కోరిక మేరకు ఎన్నో గుండె”కోతలు” మిగిల్చిన మహానుభావుడు ఈ జహందర్ షా…

సాని కళ్ళలో ఆశ్చర్యాన్ని చూసి ఆనందపరవశుడయ్యాడు..

వాడికి తగ్గవాడే మన ముఖ్యమంత్రి కచరా…

మూడు దశాబ్దాల తన రాజకీయజీవితానికి,పదమూడేళ్ళ ఉద్యమజీవితానికి(!?) కానుకగా లభించిన తెలంగాణా అధికారాన్ని సానిలా చూస్కుంటున్నాడు..

అమరుల త్యాగాలతో గద్దెనెక్కిన కచరా..

నేడు నిరుద్యోగుల ఆకలికేకలతో..

అన్నదాతల ఆక్రందనలతో..

తన అధికారదాహాన్ని సంతృప్తిపరచుకుంటూ..

కాలం వెళ్ళదీస్తున్న ఈ నయా నియంత నాటి ఔరంగజేబు మనవడు జహందర్ షా కు ఏమాత్రం తీసిపోడు..

Post by#హేము

Categories
Govt Failures Jobs/TSPSC News Victim Voice

OU లో MSc విద్యార్థి మురళి ఆత్మహత్య


ఓయూలో విద్యార్ధి ఆత్మహత్య కలకలం రేపింది. మానేరు హాస్టల్‌ సమీపంలో మురళి అనే ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్ధి ఆత్మహత్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మురళీ మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. విద్యార్ధి మృతదేహం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Watch video here

*ఓయూలో MSc physics 1st year విద్యార్థి మురళి ఆత్మహత్య.ఉద్యోగాల నోటిఫికేషన్లు రావటం లేదని మనస్తాపం తో మానేరు హాస్టల్ బాత్రూమ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మురళి*.

*సిద్దిపేట్ జిల్లా జైదేవ్ పూర్ మండలం దౌలాపూర్ గ్రామం,బిసి డి ముదిరాజ్ సామాజికవర్గం*

*సుసైడ్ నోట్ మాయం పోలీసుల పై విద్యార్థుల అనుమానం?*

*50లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించాకే మృతదేహాన్ని మానేరు హాస్టల్‌ నుండి పోస్టుమార్టమ్ తరలించాలని నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్ డిమాండ్*

*సిఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కి చెందిన ఓయూ విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకోవడం కెసిఆర్ ప్రభుత్వానికి సిగ్గుచేటు*

*సిఎం కెసిఆర్ కి మురళి ఆత్మహత్య తోనైనా కనివిప్పు కలగాలి*

*రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యల బాట పట్టకముందే ఖాళీగ ఉన్న 2లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఒకే సారి విడుదలచేయాలి. నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్*

విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికి వరకు సైలెంట్‌గా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి ఆత్మహత్యతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం మహబూబ్‌నగర్‌లో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న ‘కొలువుల కొట్లాల సభ’ నేపథ్యంలో విద్యార్థి ఆత్మహత్య సంచలనంగా మారింది.

Categories
Mallanna Sagar Victim Voice

Bathukamma Song Against CM KCR and Mallanna Sagar

Erravelli Women Emotional Bathukamma Song Against Mallanna Sagar Project and CM KCR.

Categories
Govt Failures News Public Voice

ఓ వైపు గులాబీ పురుగుల దొరల పోటు, మరోవైపు దోమ పోటు

ఓ వైపు గులాబీ పురుగుల దొరల పోటు, మరోవైపు దోమ పోటుతో దగాపడి, పండించిన పంటకు మంట పెడుతున్న రైతన్నలు.
మేము పండించే పంటలకు మద్దతు ధర కల్పించండి, ఆరుగాలం శ్రమించి ఆత్మగౌరవంతో బ్రతుకుతాం.
మా కష్టానికి విలువ ఇవ్వకుండా మీరు వేసే బిచ్చానికి అలవాటు చేసి మమ్మల్ని మీలా లచ్చగాళ్లను చేయకండి
దొరా.. నువ్వు ఇవ్వాలనుకునే 4 వేలతో నీలాగ పట్నంలో లో పండుకొని ఫామ్ హౌస్ లో పార్టీలు చేసుకునే వాళ్ళకే ఉపయోగం.

Categories
Public Voice

TRT లో పర్సెంటేజిల గోల – ఇదేం లెక్క కేసీఆర్

ఇక సాలు దొర నీ పాలన..అసలు ఎందుకోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం మర్చిపోయారా?
కొత్త జిల్లాల ప్రకారం TRT వేస్తే ఖాళీలు లేని అభ్యర్థులు నష్టపోతున్నా పట్టించుకుంటలేరు.

కష్టనష్టాలను ఓర్చి ఇన్ని రోజులు ప్రిపేర్ అయితే 40% ఉన్న కనీస మార్కులను 45% నికి పెంచి వేలాది అభ్యర్థులను పరీక్ష రాయనీయకుండా చేస్తున్నావు..ఇదేనా బంగారు తెలంగాణ ఇలా చేస్తే బంగారు తెలంగాణ వస్తది.మనం తెలంగాణ తెచ్చుకుంది ఇలా కనీసం పరీక్ష కూడా రాయకుండా ఉండడానికా?
ఇన్ని రోజులు ఉపాధ్యాయ నియామకాలపై కాలయాపన చేశారు..ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కొత్త జిల్లాల ప్రకారం ఇచ్చి ఖాళీలు లేని అభ్యర్థులకు అన్యాయం చేశారు.

కత్తి ఒకనికి ఇచ్చి ఇంకొకరితో యుద్ధం చేయమనడం న్యాయం కాదన్నావు ఆనాడు..ఇపుడు నిరంకుశ పాలనతో తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నావు ఈనాడు..

Categories
Govt Failures News Public Voice

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కండక్టర్ సస్పెండ్.

సమైఖ్య రాష్ట్రంల సుత ఇంతగనం ఒత్తిడి లేదురా అయ్యా.. పోరాటం చేశిర్రు, తిట్టిర్రు, పెన్ డౌన్ చేశిర్రు, ధర్నాలు చేశిర్రు అయినా ఉద్యోగాల జోలికి రాలే.. ఇప్పుడు వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట.. సారుకు నిజాం అంటే ఎంత గౌరవమో ఎప్పటికప్పుడు నిరూపిస్తుండు.

Categories
Govt Failures News Public Voice

ఉద్యోగం రాదని మనస్తాపానికి గురైన సిడం మహేందర్ P.G,B.Ed(social) ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

ఆదిలాబాద్ జిల్లాలో నూతన జిల్లాల DSC వల్ల ఉద్యోగం రాదని మనస్తాపానికి గురైన సిడం మహేందర్ P.G,B.Ed(social) ఆత్మహత్య కు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే మహేందర్ నిరుపేద విద్యార్థి DSC కోసం 4 సం. లుగా ప్రిపేర్ అవుతున్నాడు. DSC పై త్వరలో ప్రకటన వెలువడుతుందని హైదరాబాద్ లో ఆర్థిక భారం ఉన్నా అప్పుచేసి రెండుసార్లు కోచింగ్ తీసుకున్నాడు..ఉమ్మడి ఆదిలాబాద్ లో సోషల్ సబ్జెక్ట్ లో ఖాళీలు 40 వరకు ఉండేవి కొత్త జిల్లా ప్రకారం 3 ఉన్నాయి. కొత్త జిల్లా DSC ఉంటదని ప్రకటన చేయడం తో ఉద్యోగం రాదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.BJP జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు వారి కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేశారు. నిరుద్యోగ సోదరులారా దయచేసి ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడకండి.పోరాడి సాధించుకుందాం. మహేందర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.

Categories
KCR Flip-Flops News Public Voice Songs

కేసీఆర్ మోసం మీద జూనియర్ డాక్టర్ల పేరడీ పాట

కేసీఆర్ సారు, ఆరోగ్యశాఖలో ఇప్పటి దాకా ఎంత మందిని పెర్మెంట్ చేసినవు, కొత్తగా నియమించే వాళ్ళను మళ్ళీ గదే ఔట్సోర్సింగ్ పద్దతిని నియమించవడితిరి. 
మాటలకు చేతలకు ఏమన్న పొంతన ఉందా…..?
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అయినా చెల్లించొచ్చు కదా మహాశయా…..?
ఈ పాట వినుర్రి ఓసారి
తెలంగాణ అడబిడ్డలు మీ చేష్టలతో ఎలా విసిగిపోయారో

Categories
Govt Failures Nerella incident Victim Voice

దమన కాండపై కంట తడి పెట్టిన నేరెళ్ల దళిత కుటుంబాలు