Categories
Govt Failures SCAMS

విద్యుత్‌ కొనకుండానే ఉత్త పుణ్యానికి రూ.957 కోట్లు చెల్లించిన రాష్ట్ర డిస్కంలు

ఉత్త పుణ్యానికి రూ.957 కోట్లు.. విద్యుత్‌ కొనకుండానే ఉత్పత్తి సంస్థలకు చెల్లించిన రాష్ట్ర డిస్కంలు.. డిమాండ్‌కు సరిపడా కరెంట్‌ కొనుగోలుకు ముందస్తు ఒప్పందాలు.. అంచనాలు తప్పి 4,910 ఎంయూల విద్యుత్‌ బ్యాక్‌ డౌన్‌.. కొనకపోయినా యూనిట్‌కు రూ.1.95 చొప్పున చెల్లించిన వైనం

కొనుగోలు చేయని విద్యుత్‌కు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు అక్షరాల రూ.957.45 కోట్ల చార్జీలు చెల్లిం చాయి. రాష్ట్ర అవసరాలకు కావాల్సిన విద్యుత్‌ సమీకరణకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న డిస్కంలు.. అంచనాలు తలకిందులవడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాయి. అంచనాలకు తగ్గట్లు డిమాండ్‌ లేక 2016–17లో 4,910 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను బ్యాకింగ్‌ డౌన్‌ చేయించాయి. ఒక్కో యూనిట్‌కు రూ.1.95 చొప్పున ఆ 4,910 ఎంయూలకు రూ.957.45 కోట్ల స్థిర చార్జీలు విద్యుదుత్పత్తి కంపెనీలకు చెల్లించాయి.

కొనకపోయినా ఎందుకంటే..

రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను అంచనా వేసి ఆ మేరకు విద్యుత్‌ సమీకరించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలతో డిస్కం లు ముందస్తుగా కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)లు చేసుకున్నాయి. దీంతో విద్యుత్‌ కొనుగోలు చేయకపోయినా ఉత్పత్తి కంపెనీలకు విద్యుత్‌ స్థిర చార్జీలు లేక జరిమానా డిస్కంలు చెల్లించాలి.

ప్లాంట్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన విద్యుదుత్పత్తి కంపెనీలు.. నిరంతరంగా ఉత్పత్తి చేసి అమ్మకాలు సాగిస్తేనే మనుగడలో ఉంటాయి. డిమాండ్‌ లేనపుడు ఉత్పత్తి తగ్గించాల్సి వస్తే కంపెనీలు నష్టపోకుండా తగ్గించిన విద్యుత్‌కు స్థిర చార్జీలు లేదా జరిమానా చెల్లించాలని ఒప్పందాల్లో పొందుç ³రుస్తారు. ఇలా డిమాండ్‌ లేనప్పుడు ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించుకోవడం లేదా నిలుపుదల చేయడాన్ని బ్యాకింగ్‌ డౌన్‌ అంటారు.  

కొంప ముంచిన ఓపెన్‌ యాక్సెస్‌..

రాష్ట్రంలోని భారీ పరిశ్రమలు, రైల్వేలు, వాణిజ్య సంస్థలు, ఇతర వినియోగదారులు 2016–17లో ఓపెన్‌ యాక్సెస్‌ ద్వారా బహిరంగ మార్కెట్‌ నుంచి 2,134 ఎంయూల విద్యుత్‌ కొనడం డిస్కంల కొంపముంచింది. విద్యుత్‌ చట్టం–2003లోని వెసులుబాటును ఉపయోగించుకుని డిస్కంలను కాదని బహిరంగ మార్కెట్‌ నుంచి తక్కువ ధరకు వినియోగదారులు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారు.

బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధరలు పతనమవడంతో 2015–16లో 902 ఎంయూలు ఉన్న ఓపెన్‌ యాక్సెస్‌ కొనుగోళ్లు 2016–17 వచ్చేసరికి 2,134 ఎంయూలకు పెరిగాయి. ఓవైపు నిరంతర విద్యుత్‌ సరఫరాకు డిస్కంలు పెద్ద మొత్తంలో విద్యుత్‌ సమీకరించగా.. కొందరు వినియోగదారులు ఓపెన్‌ యాక్సెస్‌కు వెళ్లడం, అంచనాలకు తగ్గట్లు డిమాండ్‌ లేకపోవడంతో 4,910 ఎంయూల విద్యుత్‌ బ్యాకింగ్‌ డౌన్‌ చేసుకొని నష్టపోవాల్సి వచ్చింది.  

నిరంతర విద్యుత్‌ సరఫరా కోసమే: డిస్కంలు  

నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం ముందస్తు ప్రణాళికలతో విద్యుత్‌ సమీకరించామని ఈఆర్సీకి డిస్కంలు వివరణ ఇచ్చాయి. 2015–16లో రాష్ట్ర గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 6,849 ఎంయూలు కాగా, 2016–17లో 9,191 ఎంయూలకు పెరిగిందన్నాయి. ముందస్తు ప్రణాళికల వల్లే డిమాండ్‌ పెరిగినా సరఫరా కొనసాగించామని సమర్థించుకున్నాయి. 

Categories
News SCAMS

ఆహార శుద్ధి పేరిట 300 ఎకరాల రైతుల భూమికి శఠగోపం

6000 కోట్లు – 300 ల ఎకరాలు – ఆహార శుద్ధి గోల్ మాల్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే తెలుగులో సరాసరి అర్థం ఆహార శుద్ధి కాదు, పండించిన ఆహారధాన్యాలు ఎక్కువ రోజులు ఉండేలా రసాయనాలు కలిపి తక్కువ ఉష్ణగ్రతలో భద్రపరచడం. కొన్ని తెలుగు పత్రికలు ప్రజలని కావాలని కాకపోయినా తప్పుగా అర్థం చేసుకునేలా వార్తలు ప్రచురిస్తున్నాయి. ఇక ఈ రోజు అన్ని పేపర్లలో ఈ రంగంలో చూసిన వార్త ఏంటి అంటే, తెలంగాణ లో, అది జహీరాబాద్ లో దక్షిణ్ అగ్రోపోలీస్ అనే సంస్థ 6000 కోట్ల పెట్టుబడి పెట్టి, 5000 ల మందికి ఉపాధి కల్పించబోతున్నది అని వార్త. ఐతే ఈ సంస్థ ఎప్పుడు పెట్టారు, ఎంత పెద్దది అని మనం పరిశీలిస్తే, సెప్టెంబర్ 10, 2014, అంటే పెట్టి మూడు సంవత్సారాలు మాత్రమే జరిగింది. వాళ్ళు పెట్టుబడి సామర్థ్యం 2 కోట్లు మాత్రమే, ఈ సంస్థ 6000 కోట్ల పెట్టుబడి తెస్తడి అంటే నమ్మశక్యం కావడం లేదు. మొత్తం భారత ప్రభత్వం ఈ రంగంలో పెట్టె బడ్జెట్ 6000 కోట్లు , ఈ రంగం లో ఫారిన్ పెట్టుబడుల మొత్తం $750 మిల్లియన్లు . అంటే మన కరెన్సీ లో 4875 కోట్లు మాత్రమే. ఒక చిన్న సంస్థ, రెండు ఏళ్ళ వయసున్న సంస్థ 6000 కోట్లు పెట్టుబడి పెడుతుందంటే, మిమ్మల్ని వాళ్ళు తప్పు దారి ఐన పట్టించివుండాలి. లేదా మీరు మొత్తం తెలంగాణ ని తప్పుదారి ఐన పట్టిస్తుండాలి. ఇలా గొప్పలకు పోయి తెలంగాణ భూములని కట్టబెడుతూ పొతే అసలు సిసలు రైతులు బాగు పడేదెప్పుడు, ఆ రెండు వందల ఎకరాలు రెండు వందల మంది తెలంగాణ బిడ్డలకి ఎకరం చొప్పున ఇచ్చి ప్రోత్సహించాలని మనవి. ఇంకొక విషయం ఈ కంపెనీ వ్యవస్థాపకులు ఎప్పటిలాగే మన మిత్రులు “ఆంధ్ర” వారే.

మీ కోసం, కొన్ని లింక్స్ పొందుపరుస్తున్న

This company website

Central Minister ఫుడ్ ప్రాసెస్సింగ్ పెట్టుబడుల గూర్చి ఏమన్నాడో చదవండి

ఇంకొక విషయం ఈ కంపెనీ వ్యవస్థాపకులు ఎప్పటిలాగే మన మిత్రులు “ఆంధ్ర” వారే.

మన ప్రభుత్వంలో జరిగే MOU లలో అన్నిట్లలో కనపడేది.

1) తెల్ల తోలు వాళ్ళు

2) వేళ కోట్లు

3) సూట్లు, బూట్లు .

ఇవి పెడితే పిచ్చి తెలంగాణ జనం పడిపోవడం ఖాయం అని ధీమా.